ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న భిన్నమైన వాతావరణం (ఎండలు, వడగాల్పులు, ఉరుములు, వర్షాలు) మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం తెలిపారు.

పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడవచ్చు.
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగుల కింద ఆశ్రయం పొందకూడదు. ఆకాశం మేఘావృతమై, ఉరుములు వినిపించిన వెంటనే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఈదురు గాలుల వల్ల కిందపడిపోయిన విద్యుత్ తీగలను గమనిస్తూ, వాటికి దూరంగా ఉండాలి.
107 మండలాల్లో వడగాల్పుల తీవ్రత
శనివారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 107 మండలాలపై వడగాల్పుల ప్రభావం ఉండనుంది. ఇందులో 56 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 51 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తీవ్ర వడగాల్పులు వీచే జిల్లాలు
- విజయనగరం (20 మండలాలు)
- పార్వతీపురం మన్యం (14 మండలాలు)
- శ్రీకాకుళం (11 మండలాలు)
- కాకినాడ (8 మండలాలు)
- పోలవరం (2 మండలాలు)
- అల్లూరి సీతారామరాజు (1 మండలం)
ఉష్ణోగ్రతల అంచనా
42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో నమోదయ్యే అవకాశం ఉంది. 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నమోదవచ్చు.
శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇవే
- నెల్లూరు జిల్లా గూడూరు: 44.6 డిగ్రీలు (రాష్ట్రంలోనే అత్యధికం)
- పశ్చిమ గోదావరి జిల్లా తణుకు: 43.7 డిగ్రీలు
- పల్నాడు జిల్లా పిడుగురాళ్ల: 43.3 డిగ్రీలు
- కృష్ణా జిల్లా కానుమోలు, సాలూరు: 43.1 డిగ్రీలు
- ప్రకాశం జిల్లా కారేడు: 43 డిగ్రీలు
- విజయనగరం జిల్లా రాజాం: 42.7 డిగ్రీలు
- అనకాపల్లి జిల్లా రాజాం: 42.6 డిగ్రీలు
- బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, ఏలూరు జిల్లా నారాయణపురం, తిరుపతి జిల్లా పూలతోట: 42.3 డిగ్రీలు
తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరింది.
{{/usCountry}}తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరింది.
{{/usCountry}}అమరావతి వాతావరణ కేంద్రం (IMD) అంచనా ప్రకారం.. రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత క్రమంగా తగ్గి.. పలు ప్రాంతాల్లో ఉరుములు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.