SIR in Andhrapradesh : ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ - 58 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, లెక్కలు ఇలా
Special Intensive Revision in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 58.12 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు.
Special Intensive Revision in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 58.12 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫాంల పంపిణీ పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ ప్రకటించారు.

గణాంకాలు ఇలా…
క్షేత్రస్థాయిలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 2,41,93,304 మంది ఓటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్యూమరేషన్ ఫాంలను సిబ్బంది అందజేశారు. ఓటర్ల వివరాల నమోదు, తప్పుల సవరణ ప్రక్రియను మరింత పక్కాగా నిర్వహించేందుకు ఈ ఫారాల పంపిణీ ఎంతో కీలకంగా మారింది.
కేవలం ఫారాలు పంపిణీ చేయడమే కాకుండా….. వాటి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ రికార్డుల్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు అందిన ఫారాల్లో 8,45,108 ఫాంలను విజయవంతంగా డిజిటలైజ్ చేసినట్లు వివేక్ యాదవ్ వివరించారు. ఇది మొత్తం ఓటర్ల సంఖ్యలో 2.03 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను కంప్యూటరీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు ఈ సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరోవైపు ఓటర్లకు ఎన్నికల సంఘం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - 2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ వివరాలను స్వయంగా ధృవీకరించుకోవచ్చని పేర్కొంది. గతంలో లాగా ఓటర్ ఐడీలో మార్పులు చేర్పులు చేయడం కోసం లేదా వివరాల నమోదు కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక లేదు. అధికారులు మీ ఇంటికి వచ్చేవరకు వేచి చూడాల్సిన పని అంతకన్నా లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు ప్రాసెస్:
- మొదట ఓటర్లు భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.in ను సందర్శించాలి.
- అక్కడ మీ ఓటర్ ఐడీ కార్డుపై ఉన్న ఎపిక్ (EPIC) నంబర్‌ను నమోదు చేయాలి.
- మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత మీ పాత రికార్డులతో ప్రస్తుత వివరాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
- చివరగా మీ ఆధార్ ఈ-సైన్ (eSign) ద్వారా అత్యంత సురక్షితంగా ఈ ఫారమ్‌ను సబ్మిట్ చేయవచ్చు.
ఈ సరికొత్త ఆన్‌లైన్ విధానం ఓటర్లకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తుందని… ఇది అత్యంత సులభం, సురక్షితం, వేగవంతమైన ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలోని ఓటర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

