ఏపీ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - మాక్ టెస్టులు ప్రారంభం, ఇదిగో డైరెక్ట్ లింక్
ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. అభ్యర్థులు మాక్ టెస్టులు రాసుకునేందుకు వీలుగా వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (అక్టోబర్ సెషన్ 2025)కు సంబంధించి విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్ మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ అవకాశాన్ని కల్పించింది.

మాక్ టెస్టులు ఇలా రాసుకోవచ్చు…
- ఏపీ టెట్ అభ్యర్థులు ముందుగా https://tet2dsc.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని మాక్ టెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మొత్తం 13 సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి. మీకు అప్లయ్ చేసిన సబ్జెక్ట్ పక్కన ఉండే లింక్ పై క్లిక్ చేయాలి.
- ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండా సైన్-ఇన్ అవడం ద్వారా ఉచిత మాక్ టెస్టులను ఉపయోగించుకోవచ్చు.
- ఈ పరీక్షలను రాయటం ద్వారా పరీక్షా విధానంతో పాటు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఓ అవగాహనకు రావొచ్చు.
ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ప్రతి రోజూ 2 సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2న, ఫైనల్ కీ జనవరి 13న, తుది ఫలితాలు 19న విడుదలవుతాయి. ఏవైనా సందేహాలు ఉంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్లను (8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286, 6281704160) సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

