తెలంగాణ టెట్ 2026 : ఈసారి భారీగానే దరఖాస్తులు - హాల్ టికెట్లు ఎప్పుడంటే..?
తెలంగాణ టెట్ - 2026 దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. 2 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.
టీజీ టెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగానే పెరిగింది. శనివారం సాయంత్రం సమయానికి 2,26,956 దరఖాస్తులు రాగా… అర్ధరాత్రి వరకు మరికొంతమంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సంఖ్య 15 వేల నుంచి 20 వేల మధ్య ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్ - 2025కు 1.83 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 1.37 లక్షల మందే పరీక్ష రాశారు. అయితే ఈసారి మాత్రం… 2 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకు సైతం టెట్ తప్పనిసరి కావడంతో చాలా మంది ఈ పరీక్షను రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి వీరు కూడా చాలా మంది దరఖాస్తు చేశారు. వీరి సంఖ్య 70 వేలుగా ఉంది.
హాల్ టికెట్లు ఎప్పుడంటే…?
డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.
టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
అందుబాటులోకి ఎడిట్ ఆప్షన్…
ఇదిలా ఉంటే దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సవరించుకోవటానికి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని పేర్కొంది. ఈ గడువు డిసెంబర్ 1వ తేదీతో పూర్తవుతుంది.
టీజీ టెట్ అప్లికేషన్ - ఎడిట్ ప్రాసెస్…
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- హోం పేజీలో ‘ఎడిట్ అప్లికేషన్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.
- ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

