ప్రవాస తెలుగువారిని పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు తెలుగుదేశం పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత విస్తరణ, అంతర్జాతీయ ఎన్‌ఆర్‌ఐ నెట్‌వర్క్ బలోపేతమే లక్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నియామకం చేపట్టారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా 'డాక్టర్ రాజా'ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పార్టీ కోసం తెరవెనుక ఉండి విశేష సేవలు అందించిన డాక్టర్ రాజాను ఈ పదవి వరించింది. ఆయనకున్న నాయకత్వ లక్షణాలు, సంస్థాగత అనుభవం, అంతర్జాతీయంగా ఉన్న ప్రవాసాంధ్రులతో గల సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతను పార్టీ వైపు ఆకర్షించడం, వారి నైపుణ్యాలను రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకోవడం ఈ నియామకం వెనుక ఉన్న ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
నాయకత్వానికి కృతజ్ఞతలు - డాక్టర్ రాజా
తన నియామకంపై డాక్టర్ రాజా స్పందిస్తూ… పార్టీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. "నాపై నమ్మకంతో ఈ భారీ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు , రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు" అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలను ఒకే తాటిపైకి తెచ్చి, అత్యంత వేగవంతమైన గ్లోబల్ నెట్‌వర్క్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రవాస తెలుగు వారి అంతర్జాతీయ అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక సహకారం, నవకల్పనలతో పాటు యువత సాధికారతకు అనుసంధానం చేయడమే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. "నేటి ఏఐ, డిజిటల్ పరివర్తన యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువ నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువస్తాం. విద్య, వైద్యం, వ్యవసాయం, స్టార్టప్‌లు, సుస్థిర అభివృద్ధి వంటి కీలక రంగాల్లో భవిష్యత్తుకు అనుగుణమైన మార్పుల కోసం పనిచేస్తాం," అని డాక్టర్ రాజా వివరించారు. రాబోయే 2029 ఎన్నికల్లో పార్టీ చారిత్రాత్మక విజయానికి గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఒక ప్రధాన శక్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. "నేటి ఏఐ, డిజిటల్ పరివర్తన యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువ నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువస్తాం. విద్య, వైద్యం, వ్యవసాయం, స్టార్టప్‌లు, సుస్థిర అభివృద్ధి వంటి కీలక రంగాల్లో భవిష్యత్తుకు అనుగుణమైన మార్పుల కోసం పనిచేస్తాం," అని డాక్టర్ రాజా వివరించారు. రాబోయే 2029 ఎన్నికల్లో పార్టీ చారిత్రాత్మక విజయానికి గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఒక ప్రధాన శక్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ నియామకం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ దేశాలు, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ రాజాకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ప్రవాసాంధ్రుల్లో సరికొత్త జోష్ నింపిందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.