...
...
Next Story

రాజమండ్రిలో ఘోరం.. మెడికల్ విద్యార్థినిపై కారు ఎక్కించిన తాగుబోతులు!

రాజమండ్రిలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో యువ వైద్యురాలిపై కారును ఎక్కించారు ఇంజినీరింగ్ స్టూడెంట్స్.

Published on: Aug 7, 2026, 09:12:15 IST
Advertisement

మద్యం మత్తు, క్షణికావేశం రెండు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపాయి. కాబోయే భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఒక యువ వైద్యురాలు, ఇద్దరు పోకిరీల ఉన్మాదానికి బలవుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది.

రాజమండ్రిలో యువతిపై కారు ఎక్కించిన యువకులు
రాజమండ్రిలో యువతిపై కారు ఎక్కించిన యువకులు

సోమవారం రాత్రి ఈ దారుణం జరగ్గా.. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో గురువారం నాడు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక అనే యువతి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగాలో పీజీ (వైద్య విద్య) అభ్యసిస్తోంది. సోమవారం రాత్రి ఆమె తన సహచర విద్యార్థినితో కలిసి రాజమహేంద్రవరంలోని ఏ.వి. అప్పారావు రోడ్డులో ఉన్న ఐనాక్స్ థియేటర్‌లో ఫస్ట్ షో సినిమా చూసేందుకు వెళ్లింది.

అదే సమయంలో బి.టెక్ చదువుతున్న సురవరవరపు దష్వంత్, అతని బంధువు ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ అనే ఇద్దరు యువకులు సెకండ్ షో సినిమా కోసం అక్కడికి వచ్చారు. థియేటర్ లోపలికి వెళ్లే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించినట్లు తేలడంతో లోపలికి అనుమతించలేదు.

సినిమాకు అనుమతించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకులు పార్కింగ్ వైపు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఫస్ట్ షో ముగించుకుని ఆ ఇద్దరు మెడికల్ విద్యార్థినిలు తమ ద్విచక్రవాహనంపై బయటకు వస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు వారి బైక్‌ను కారులో అనుసరిస్తూ ఉద్దేశపూర్వకంగానే వెనక నుంచి రెండుసార్లు ఢీకొట్టారు. మూడోసారి మరింత వేగంగా, బలంగా ఢీకొట్టడంతో బైక్ వెనక కూర్చున్న ప్రియాంక రోడ్డుపై పడిపోయింది. ఆ తాగుబోతులు కారును ఆమె పైనుంచి తొక్కిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సౌత్ జోన్ డిఎస్పి ఎ. సుభాష్, ప్రకాష్ నగర్ సిఐ ఆర్.ఎస్.కె. బాజీ లాల్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే థియేటర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks