ఉద్యోగులను ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి పంపండి : పోలీసులు
భారీ వర్ష సూచన నేపథ్యంలో కార్యాలయాల నుండి విడతల వారీగా ముందుగానే బయలుదేరాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉద్యోగులకు సూచించారు. ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ముందుగానే వెళ్లాలని తెలిపారు
హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఐటీ కంపెనీలు, సంస్థలు విడతల వారీగా కార్యాలయాల నుంచి ఉద్యోగులను ముందుగానే పంపాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడటం దీని ముఖ్య ఉద్దేశం.

'నగరంలో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఐటీ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను విడతల వారీగా ముందుగానే ఆఫీసు నుంచి వెళ్లేందుకు అనుమతించాలి.' అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ జారీ చేశారు.
రహదారి మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని తగ్గించడం, ప్రయాణ సంబంధిత ప్రమాదాలను స్థాయికి తగ్గించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ముందుగానే ఆఫీసుల నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ వ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణకు వీలుగా, కంపెనీలు తమ కార్యాలయాల స్థానాలను, ప్రతిపాదిత ముందస్తు లాగౌట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని కూడా కోరారు.
రాబోయే భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు, ఈ సలహాను అమలు చేయడంలో సహకరించాలని సంస్థలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఐఎండీ హైదరాబాద్ ప్రకారం సోమవారం పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది గణనీయమైన తగ్గుదలగా ఉంది.
హైదరాబాద్‌లోనూ వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లలో సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. అనవసరంగా బయటకు రావడం మానుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం అయ్యారు. డ్రైనేజీ వ్యవస్థలలో నీరు నిలవడాన్ని తనిఖీ చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


