తిరుమల : వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం
తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతఃకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతఃకాల కైంకర్యాలు ముగించారు. ఆ తర్వాత గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు.

పల్లకీలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య శుభముహుర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని 3 సార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది.
మరోవైపు ఈ జనవరి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
- జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
- జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.
- జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
- జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
- జనవరి 14న భోగి.
- జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
- జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
- జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
- జనవరి 23న వసంత పంచమి.
- జనవరి 25న రథ సప్తమి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

