టీటీడీ : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెల విశేష పర్వదినాలు
తిరుమలలో జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. శ్రీవారి భక్తులు దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.
తిరుమలలో కొత్త ఏడాదిలో జరిగే విశేష పర్వదినాల గురించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు అధికారులు ప్రకటించారు. జనవరి 4న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర, 12న అధ్యయనోత్సవాలు సమాప్తి కార్యక్రమాలను నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

- జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
- జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.
- జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
- జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
- జనవరి 14న భోగి.
- జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
- జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
- జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
- జనవరి 23న వసంత పంచమి.
- జనవరి 25న రథ సప్తమి.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొండపై భక్తుల రద్దీ నెలకొన్నది. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది.
కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది.
విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామి వారు కపిలతీర్థం పుష్కరిణిలో 9 చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


