తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు - ఈ ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి

తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు సర్వం సిద్ధమైంది. రేపు(డిసెంబర్ 29) అర్ధరాత్రి తర్వాత 12.05 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం నుంచి దర్శనాలకు అవకాశం కల్పిస్తారు.

Published on: Dec 28, 2025, 13:12:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత శ్రీవారి ఆలయంలో ఏకాంత పూజలు చేస్తారు. ఆ తర్వాత అంటే మంగళవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఈ-డిప్‌లో టోకెన్లు కలిగిన భక్తులనే అనుమతిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

వైకుంఠ ద్వార దర్శనాలు - ముఖ్యమైన విషయాలు:

  1. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలను కూడా ప్రకటించింది.
  2. వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో SED, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్లు జారీ చేయబడవు.
  3. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది. జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు.
  4. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవు.
  5. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు.
  6. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
  7. జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు.
  8. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
  9. రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాత‌లు వారి కుటుంబ స‌భ్యుల‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు రోజుకు 125 మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. రూ.ల‌క్ష నుండి రూ.99 ల‌క్ష‌ల వ‌ర‌కు విరాళం ఇచ్చిన దాత‌ల‌కు డిసెంబ‌ర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి దర్శనం ఉంటుంది.
  10. జ‌న‌వ‌రి 1వ తేది నుండి 8వ తేది వ‌ర‌కు రోజుకు 2వేల మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. వీరు కూడా ఆన్ లైన్‌ అప్లికేష‌న్ లో డిసెంబ‌ర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్ల‌ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More