Vaikunta Ekadashi: డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది!
చాలా మంది ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. త్వరలోనే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రాబోతోంది. ఈ ఏకాదశి విశిష్టమైనది. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే రోజు ఇది. ఆ రోజు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది. ఆరోజు చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం.
ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించిన చక్కటి ఫలితం కలుగుతుంది. అందుకే చాలా మంది ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. త్వరలోనే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రాబోతోంది. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే రోజు ఇది. ఆ రోజు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆరోజు చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి 2025 ఎప్పుడు వచ్చింది?
ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, మంగళవారం నాడు వచ్చింది. ఈరోజు మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. చెడ్డ పనులు చేయడం వలన సమస్యలు వస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేయడం మంచిది కాదు.
వైకుంఠ ఏకాదశి నాడు చేయాల్సినవి, చేయకూడనివి
1.తులసి ఆకులు కోయకూడదు:
వైకుంఠ ఏకాదశి నాడు తులసి ఆకులను కోయడం మంచిది కాదు. విష్ణువుకు తులసి అంటే ఎంతో ఇష్టం. ఏకాదశి నాడు విష్ణువుకు తులసిని సమర్పించాలి, కానీ ఆ రోజు కోయకుండా ముందు రోజే కోసి పెట్టుకోవాలి. ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకోవడం మహా పాపం.
2.బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు:
ఏకాదశి నాడు అన్నం, బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు తినకూడదు. ఆరోజు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని అంటారు. అందుకని ఆ రోజు అన్నంతో చేసిన ఆహార పదార్థాలు తినరు.
3.ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వద్దు:
ఏకాదశి నాడు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామసిక ఆహారాలు తినకూడదు. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.
4.ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి:
ఏకాదశి నాడు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఎవరితో గొడవ పడడం కూడా మంచిది కాదు.
5.పగలు నిద్రపోకూడదు:
ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైన రోజు. ఆరోజు హరినామ స్మరణ చేయాలి. పగలు నిద్రపోవడం మంచిది కాదు. రాత్రి అంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.
వైకుంఠ ఏకాదశి నాడు చేయాల్సినవి
1.అన్న దానం చేయండి:
ముక్కోటి ఏకాదశి నాడు అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. పేదలకు, లేనివారికి తోచిన వాటిని దానంగా ఇస్తే కూడా పుణ్యం కలుగుతుంది.
2.ఉపవాసం, జాగరణ
విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి నాడు స్తుతిస్తే మోక్షం కలుగుతుంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం ఉద్భవించిన రోజు కూడా ఇదేనని విశ్వాసం. అందుకనే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి, లక్ష్మీ సమేతమైన విష్ణువును ఆరాధించి, రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు అతిథి లేకుండా భోజనం చేయకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి.
3.ఈ మంత్రాన్ని జపించండి
వైకుంఠ ఏకాదశి నాడు “ఓం నమో నారాయణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. అలా చేయడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం. అలాగే ఆ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించే గీతా పారాయణం, గోవింద నామస్మరణ చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. గోసేవ, పురాణ శ్రవణం, దానధర్మాలు వంటివి పాటించడం వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తే జ్ఞానవంతులు అవుతారు.
లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏ వస్తువులను దానం చేయాలి?
వైకుంఠ ఏకాదశి నాడు లక్ష్మీ కటాక్షం కలగాలంటే తులసి మొక్క, దుప్పటి, ధాన్యం లాంటి వాటిని పేదలకు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆహారం, బట్టలు, ఆర్థిక సహాయం వంటివి చేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. ఆ రోజు గోవును దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


