డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఒక్క పని చేయండి చాలు!
వైకుంఠ ఏకాదశి 2025: వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30న రాబోతోంది. ఆ రోజు ఉత్తర దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. మొత్తం మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలో ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో వస్తాయి. 12 నెలలకుగాను 24 ఏకాదశులు వస్తాయి.
వైకుంఠ ఏకాదశి 2025: ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది, అత్యంత పవిత్రమైనది. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువును పూజించడం వలన ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది, పుణ్యం వస్తుంది. ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.

వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తితో ఆరాధిస్తే పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆనందంగా ఉండవచ్చు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఆ రోజు చేయాల్సిన పనుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వైకుంఠ ఏకాదశి 2025
వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30న రాబోతోంది. ఆ రోజు ఉత్తర దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. మొత్తం మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలో ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో వస్తాయి. 12 నెలలకుగాను 24 ఏకాదశులు వస్తాయి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి దేవతలు విష్ణువుని స్తుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు అవడంతో దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు.
వైకుంఠ ఏకాదశి 2025 తేదీ, సమయం
ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, మంగళవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి డిసెంబర్ 30, మంగళవారం ఉదయం 7:51కి మొదలవుతుంది. డిసెంబర్ 31, బుధవారం ఉదయం 5:01తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30, మంగళవారం నాడు జరుపుకోవాలి. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. అలాగే విష్ణువు ఆలయాలను సందర్శిస్తే కూడా పుణ్యం వస్తుంది. ఆ రోజు పూజలు, దానధర్మాలు చేస్తే అనేక జన్మల పుణ్య ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. లక్షలాది మంది భక్తులు ఆ రోజుకోసం ఎదురుచూస్తూ విష్ణు అనుగ్రహం పొందడానికి పరిహారాలను పాటిస్తూ ఉంటారు.
వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఒక్క పని తప్పక చేయండి
వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మనసు స్వచ్ఛమవుతుంది. విష్ణువు అనుగ్రహంతో జీవితంలో అనేక రకాల విలాసాలను పొందవచ్చు. అన్ని సుఖాలను అనుభవించిన తరువాత మరణానంతరం మోక్షాన్ని పొందుతారని నమ్మకం.
వైకుంఠ ఏకాదశి నాడు ఇలా పూజ చేయండి
- వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తరువాత విష్ణువును ఆరాధించాలి.
- పూజ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. విష్ణు విగ్రహం లేదా చిత్రాన్ని పెట్టి విష్ణువుకు నీటితో అభిషేకం చేయండి.
- చందనం, సింధూరం, పువ్వులు సమర్పించండి.
- ఆ తరువాత విష్ణు మంత్రాలను పఠించండి. 'ఓం నమో భగవతే వాసుదేవాయ', 'ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్' ఇలా మీకు నచ్చిన మంత్రాలను చదువుకోవచ్చు.
- స్వామికి పండ్లు, స్వీట్లను సమర్పించండి. హారతి ఇచ్చి క్షమాపణలు కోరండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


