Saphala Ekadashi Remedies: డిసెంబర్ 15న సఫల ఏకాదశి.. ఆ రోజు ఈ పరిహారాలను పాటిస్తే విజయాలను అందుకోవచ్చు!
Saphala Ekadashi: ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి నాడు విష్ణువును పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి, ఆనందంగా ఉండొచ్చు. మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనదైనందున సఫల ఏకాదశి అని అంటారు. డిసెంబర్ 15న ఈ వచ్చే సఫల ఏకాదశి వ్రతం చాలా ఫలితమైనది అని చెబుతారు.
Saphala Ekadashi: ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి నాడు విష్ణువును పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి, ఆనందంగా ఉండొచ్చు. మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనదైనందున సఫల ఏకాదశి అని అంటారు. డిసెంబర్ 15న ఈ వచ్చే సఫల ఏకాదశి వ్రతం చాలా ఫలితమైనది అని చెబుతారు. మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఈ సఫల ఏకాదశి నాడు ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

విజయాన్ని అందుకోవచ్చు
మార్గశిర మాసంలో వచ్చే సఫల ఏకాదశి నాడు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విజయాలను అందుకోవచ్చు. ఈ తిథి అందుకు చాలా ఉత్తమమైనది. ఆ రోజు చేసే పరిహారాలు కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.
సఫల ఏకాదశి వ్రతం 2025
సఫల ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ 15న జరుపుకోవాలి. డిసెంబర్ 14 సాయంత్రం ఏకాదశి తిథి మొదలవుతుంది. డిసెంబర్ 15 రాత్రి 9:19 దాకా ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి డిసెంబర్ 15న సఫల ఏకాదశి జరుపుకోవాలి.
పిండి దీపం పెట్టండి
ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే దీపాన్ని వెలిగించండి. విష్ణు ముందు పిండి దీపాన్ని పెట్టడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఇంకా మెరుగైన ఫలితాలు చూడాలనుకుంటే పిండితో దీపం చేసి అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంకా ఎక్కువ రెట్లు ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.
తియ్యటి పదార్థాలు నివేదించండి
విష్ణువుకు సఫల ఏకాదశి నాడు తియ్యటి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. అలాగే విష్ణు సహస్రనామం జపించండి. ఈ విధంగా చేయడం వలన కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకోవచ్చు, విజయాలను పొందవచ్చు. ఏ ఇబ్బంది రాదు, పనులు మధ్యలో ఆగిపోవడం వంటివి ఉండవు. అనుకున్నవి చక్కగా పూర్తవుతాయి.
వైవాహిక జీవితంలో సమస్యలు
మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటున్నట్లయితే అరటి చెట్టుకు దారాన్ని చుట్టి పూజ చేయండి. ఇలా చేయడం వలన భాగస్వామితో ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


