Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి!

Saphala Ekadashi: సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుందని; విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు. మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు.

Published on: Dec 4, 2025, 13:30:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందువులు ఏకాదశిని పర్వదినంగా భావిస్తారు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుందని; విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు.

Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది? (pinterest)
Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది? (pinterest)

మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విజయాలను అందుకోవచ్చు. జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏడాది సఫల ఏకాదశి డిసెంబర్ 15న వచ్చింది. ఆ రోజు విష్ణువును ఆరాధించడంతో పాటు కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి.

సఫల ఏకాదశి 2025 ఎప్పుడు వచ్చింది?

ఏకాదశి తిథి డిసెంబర్ 14, 2025 ఆదివారం మధ్యాహ్నం 04:48 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 15, సోమవారం మధ్యాహ్నం 03:59 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం డిసెంబర్ 15న జరుపుకోవాలి. తరవాత రోజు ద్వాదశ తిథి నాడు ఉపవాసాన్ని విరమించాలి.

సఫల ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి:

  • సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినకుండా చూసుకోండి. ఉపవాసం ఉండలేని వారు అన్నం తినకుండా ఏదైనా ప్రసాదం, పండ్లు, పాలు వంటివి తీసుకోవచ్చు. ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  • సఫల ఏకాదశి నాడు వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. థామసిక ఆహారాన్ని తినకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజు కూడా తామసిక ఆహారం తినకుండా చూసుకోవాలి.
  • ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకోకూడదు, తులసి ఆకులను కోయకూడదు, తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. తులసి దళాలను విష్ణువుకి ఏకాదశి నాడు సమర్పించాలి అనుకుంటే ఒక రోజు ముందుగానే వాటిని కోసి ఉంచుకోండి.
  • ఏకాదశి నాడు అబద్దాలు చెప్పడం, గొడవలు పడడం, పెద్దవారిని బాధపెట్టడం వంటివి చేయకూడదు. అలా చేయడం వలన ఉపవాస ఫలితం పోతుంది.
  • ఏకాదశి నాడు ఎవరిని అనవసరంగా అవమానించడం, తిట్టడం లాంటివి చేయకూడదు. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి; సానుకూల ఆలోచనలు కలిగేలా చూసుకోవాలి, ఆరాధించాలి. భగవన్నామస్మరణలో ఉండాలి.
  • ఏకాదశి నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు. ఇలా ఈ పొరపాట్లు చేయకుండా విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే సఫల ఏకాదశి నాడు ఎంతో పుణ్యం కలుగుతుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. విజయాలను అందుకోవడానికి వీలవుతుంది.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More