కొత్త సంవత్సరం వచ్చేస్తోంది, పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. లేదంటే ప్రతికూల శక్తితో బాధ పడాలి!

ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా మొదలు పెట్టాలని అనుకుంటారు. కొత్త సంవత్సరం ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని, అనుకున్నవి జరగాలని భావిస్తారు. వాస్తు ప్రకారం వీటిని ఫాలో అవ్వడం వలన కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరం రాక ముందే ఈ పనులు పూర్తి చేయండి.

Published on: Dec 13, 2025, 15:00:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభం కాబోతోంది. న్యూ ఇయర్‌కి ముందే ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా మొదలు పెట్టాలని అనుకుంటారు. కొత్త సంవత్సరం ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని, అనుకున్నవి జరగాలని భావిస్తారు. వాస్తు ప్రకారం వీటిని ఫాలో అవ్వడం వలన కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరం రాక ముందే ఈ పనులు పూర్తి చేయండి. వాస్తు ప్రకారం కొత్త సంవత్సరం రాకముందే ఈ మార్పులు చేయండి.

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది, పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది, పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇలా ఎన్నో రకాల లాభాలను పొందడానికి వీలవుతుంది.

వాస్తు ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభం ముందు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి

వాస్తు ప్రకారం మనం వాడే షూ, చెప్పులు ఇంటి లోపల ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించి కొన్ని నియమాలని తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే పేదరికం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

1.ప్రధాన ద్వారం

ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండాలి. ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు, షూ వంటివి పెట్టకూడదు. అలా చేయడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు, షూ వంటివి పెట్టకండి.

2.పాత చెప్పులు

చాలా మంది ఇళ్లల్లో పాత చెప్పులు ఉంటాయి. వాటినే ఉపయోగించరు, చిరిగిపోయినవీ ఉంచుతారు. అలా ఉంచితే పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త ఏడాది రాక ముందు వాటిని ఇంటి నుంచి తొలగించడం చాలా ముఖ్యం.

3.మంచం కింద పెట్టకండి

చాలా మంది మంచం కింద షూ, చెప్పులు వంటివి పెడుతూ ఉంటారు. అలా చేస్తే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మంచం కింద వాటిని ఉంచడం వలన సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఈ తప్పు చేయకుండా చూసుకోండి.

4.తులసి మొక్క

తులసి మొక్క దగ్గర కూడా షూ, చెప్పులు వంటివి పెట్టకూడదు. ఇలా చేయడం వలన వాస్తు దోషం కలుగుతుంది. వీలైనంత వరకు వాటిని తులసి మొక్కకు దూరంగా ఉంచండి. అప్పుడే ఇబ్బంది రాదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More