Planets Transit: 13 రోజుల్లో 3 ప్రధాన గ్రహ సంచారాలు, ఈ రాశులకు న్యూ ఇయర్ నుంచి కాసుల వర్షమే, పట్టిందల్లా బంగారమే

Planets Transit: గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. గ్రహాల సంచారం బట్టి హఠాత్తుగా అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.

Published on: Dec 12, 2025, 10:00:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Planets Transit: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. గ్రహాల సంచారం బట్టి హఠాత్తుగా అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.

Planets Transit: 13 రోజుల్లో 3 ప్రధాన గ్రహ సంచారాలు (pinterest)
Planets Transit: 13 రోజుల్లో 3 ప్రధాన గ్రహ సంచారాలు (pinterest)

ధనుస్సు రాశిలోకి సూర్యుడు

సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్య సంచారం జరిగినప్పుడు కూడా అన్ని రాశుల వారి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. సూర్యుడు ఈ డిసెంబర్ నెలలో ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. నెల రోజుల పాటు సూర్యుడు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మకర సంక్రాంతి నాడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

శుక్రుడు, బుధుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు డిసెంబర్ 16న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత నాలుగు రోజులకి అంటే డిసెంబర్ 24న శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు డిసెంబర్ 29న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ మూడు గ్రహాలు ధనస్సు రాశిలో సంయోగం చెందడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ సంయోగం జనవరి 2026 వరకు ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.

మూడు గ్రహాల కలయికతో ఈ రాశుల వారికి అద్భుతం.. అన్ని విధాలుగా లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి ఈ మూడు గ్రహాల కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి కలిగిన సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. కొత్త సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. కెరీర్‌కు సంబంధించి కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయికతో అద్భుత సమయం ఉంటుంది. ఈ రాశి వారు త్రిగ్రాహి యోగంతో సానుకూల మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్నేహితుల సహాయంతో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎక్కువ లాభాలను పొందుతారు. కొత్త సంవత్సరం మీకు ఆనందంగా ఉంటుంది.

3.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి కూడా ఈ యోగం అద్భుతంగా ఉంటుంది. ఈ మూడు గ్రహాల కలయికతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లపై ఫోకస్ చేస్తారు. ఇంట్లో ఆర్థిక లాభాలను పొందుతారు. ట్రిప్ వేస్తే కూడా కలిసి వస్తుంది. మొత్తానికి 2026 ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More