...
...
Next Story

ఏపీ లిక్కర్ కేసు : విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో భాగంగా ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Published on: Jan 17, 2026, 11:05:24 IST
Advertisement

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

విజ‌య‌సాయిరెడ్డి
విజ‌య‌సాయిరెడ్డి

గత వైసీపీ హయాంలో మద్యం కేటాయింపుల అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును సీఐడీ ప్రత్యేకంగా విచారిస్తోంది. సీఐడీ విచారణ ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికే ఈ కేసులో సీఐడీ విచారణకు కూడా విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆయన్నుంచి పలు కీలక సమాచారాన్ని కూడా సేకరించారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈడీ నోటీసులు ఇవ్వటం కీలకంగా మారింది. అయితే ఈనెల 22వ తేదీన విజయసాయిరెడ్డి హాజరయ్యేతే… ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటారనేది ఉత్కంఠగా మారింది. ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా…. నెక్స్ట్స్ ఈడీ మరికొంత మందిని విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks