రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తీవ్రంగా ఖండించారు. మెరిట్ జాబితాలో రావాల్సాిన ఉద్యోగాలను దివ్యాంగులకు (PwBD) కేటాయించడం వల్ల నష్టం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టారు.
చట్టబద్ధంగానే నియామక ప్రక్రియ - తమీమ్ అన్సారియా
శుక్రవారం అమరావతి సచివాలయంలోని ప్రచార విభాగంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 77 ప్రకారం హారిజాంతల్ రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, అత్యంత మెరిట్ ప్రాతిపదికన చట్టబద్ధంగానే ఈ నియామక ప్రక్రియ సాగిందని కమిషనర్ స్పష్టం చేశారు. దివ్యాంగ అభ్యర్థులకు వర్తించే నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దేవగుప్తపు సంతోషి పార్వతి కేసు,భాస్కర్ రెడ్డి కేసును వివరించారు.
జీవో 77 ప్రకారం గతంలో లాగా ప్రత్యేక రోస్టర్ పాయింట్లు కేటాయించే పద్ధతికి స్వస్తి పలికామని అన్సారియా వెల్లడించారు. దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు, క్రీడాకారులకు వారి వర్టికల్/కమ్యూనిటీ రోస్టర్‌లోనే సర్దుబాటు చేసే ఆధునిక హారిజాంతల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిని జనరల్ మెరిట్ అభ్యర్థులను తొలగించడంగా చిత్రీకరించడం సమంజసం కాదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి 5,77,675 దరఖాస్తులు రాగా, 3,36,300 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. 154 కేంద్రాల్లో 24 రోజుల పాటు 89 సెషన్లలో అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షనిర్వహించారు. ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లపై వచ్చిన అభ్యంతరాలను నిపుణులతో పరిశీలించి నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా తుది స్కోర్లు వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం 15,941 మంది ఎంపికను ఆమోదించామని, వచ్చిన 1,135 గ్రీవెన్సులను ఎప్పటికప్పుడు పరిష్కరించామని తెలిపారు.
శాప్ ఎండీ వివరణ…
క్రీడా విభాగం నియామకాలపై వస్తున్న రూమర్లను శాప్ ఎండీ భరణి తోసిపుచ్చారు. పింజారి ఇస్మాయిల్ బాషా, షేక్ అన్వర్ బాషా అనే అభ్యర్థుల జూడో క్రీడా ధ్రువపత్రాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూడో అసోసియేషన్ అందించిన ఫామ్ 2, జన్యూన్‌నెస్ ధ్రువీకరణల ఆధారంగానే ఆమోదించామని చెప్పారు. ఇస్మాయిల్ బాషా 2018 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్‌లో ద్వితీయ స్థానం, అన్వర్ బాషా 2022 పోటీల్లో తృతీయ స్థానం సాధించినట్లు గుర్తింపు పొందిన సంఘాలు ధ్రువీకరించాయని ఆమె తెలిపారు.
{{/usCountry}}క్రీడా విభాగం నియామకాలపై వస్తున్న రూమర్లను శాప్ ఎండీ భరణి తోసిపుచ్చారు. పింజారి ఇస్మాయిల్ బాషా, షేక్ అన్వర్ బాషా అనే అభ్యర్థుల జూడో క్రీడా ధ్రువపత్రాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూడో అసోసియేషన్ అందించిన ఫామ్ 2, జన్యూన్‌నెస్ ధ్రువీకరణల ఆధారంగానే ఆమోదించామని చెప్పారు. ఇస్మాయిల్ బాషా 2018 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్‌లో ద్వితీయ స్థానం, అన్వర్ బాషా 2022 పోటీల్లో తృతీయ స్థానం సాధించినట్లు గుర్తింపు పొందిన సంఘాలు ధ్రువీకరించాయని ఆమె తెలిపారు.
{{/usCountry}}స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వైరల్ అయిన ఒక అనుమానాస్పద ఆడియో క్లిప్‌పై శాప్ తక్షణమే స్పందించిందని భరణి చెప్పారు. జులై 25, 2025న విజయవాడ పోలీస్ కమిషనర్‌కు, జులై 28న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ జరిపి ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అర్హులైన నిజమైన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చామని… ఆధారాలు లేని సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని ఆమె కోరారు.