Special Trains : దక్షిణ మధ్య రైల్వే వేళాంకన్ని స్పెషల్ ట్రైన్స్.. వయా ఆంధ్రప్రదేశ్
వేళాంకన్ని పండుగ సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లోకమాన్య తిలక్ - వేళాంకన్ని మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.
దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేళాంకన్ని ఉత్సవం 2026 సందర్భంగా అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ లోకమాన్య తిలక్ - వేళాంకన్ని - లోకమాన్య తిలక్ మధ్య ప్రత్యేక రైలు సేవలను అందిస్తోంది. ఈ ట్రైన్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తాయి. రైల్వే ప్రయాణికులు ఈ ట్రైన్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

ట్రైన్ నెంబర్ 01161 లోకమాన్య తిలక్ - వేళాంకన్ని బుధ, సోమ వారాల్లో ఉదయం 11.50 గంటలకు బయల్దేరుతుంది. శుక్ర, బుధవారాల్లో వేళాంకన్నికి ఉదయం 2 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సర్వీస్ ఆగస్టు 26, సెప్టెంబర్ 7వ తేదీన రెండు సర్వీసులు నడుస్తుంది.
01162 ట్రైన్ వేళాంకన్ని నుంచి శుక్ర, బుధవారాల్లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరుతుంది. శని, గురువారాల్లో సాయంత్రం 4 గంటలకు లోకమాన్య తిలక్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ సర్వీసులు ఆగస్టు 28, సెప్టెంబర్ 9వ తేదీల్లో ఉంది.
ఈ ప్రత్యేక రైళ్లు థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణమలై, విల్లుపురం, మయిలాదుతురై జంక్షన్, నాగపట్నం స్టేషన్లలో రెండువైపులా ఆగుతుంది. ముందస్తు రిజర్వేషన్లు 02.08.2026(ఆదివారం) ఉదయం 08:00 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ రైళ్లలో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాగ్‌రాజ్, తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
రైలు నంబర్ 04171 (ప్రయాగ్‌రాజ్ - తిరునెల్వేలి) : ఈ రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. 01.08.2026 నుంచి 22.08.2026 వరకు మొత్తం 4 సర్వీసులను నడపనున్నారు.
రైలు నంబర్ 04172 (తిరునెల్వేలి - ప్రయాగ్‌రాజ్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. 03.08.2026 నుంచి 24.08.2026 మధ్య మొత్తం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లోని అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. మాణిక్‌పూర్, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బలార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, శాతూర్, కోవిల్‌పట్టి స్టేషన్లలో ఆగుతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


