కల్లాపి చల్లే పొడికి ఆత్మహత్యలకు లింకేంటి? కడప జిల్లాలో పోలీసుల సెర్చింగ్
ఇళ్లే ముందు కల్లాపి చల్లే పొడి తయారుచేసే కంపెనీలపై పోలీసులు సీరియస్ సెర్చింగ్ చేస్తున్నారు. దీనికి కారణం ఆత్మహత్యలతో లింక్ ఉండటమే. కడప జిల్లాలో చాలా కొన్ని ఆత్మహత్యలు కల్లాపి పౌడర్‌తో లింక్ ఉన్నాయి.
కడప పోలీసులు కల్లాపి పొడిని తయారు చేసే పలు కేంద్రాలపై సంయుక్త దాడులు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న సరుకును స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో తయారుచేస్తున్న కల్లాపి పౌడర్ కంపెనీల మీద ఫోకస్ చేశారు అధికారులు. దీనికి కారణం లేకపోలేదు.

ఇళ్ల ముందు వాకిలిలో చల్లడానికి సాధారణంగా ఆవుపేడ కలిపిన నీటిని ఉపయోగిస్తారు. దానికి చౌకైన ప్రత్యామ్నాయంగా వాడే కల్లాపి పొడిని సేవించడం వల్ల కడప జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరగడమే పోలీసుల ఫోకస్‌కు ప్రధాన కారణమని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రొద్దుటూరులో ఉన్న ఇటువంటి ఐదు కర్మాగారాలు పసుపు, కుంకుమ పొడిని తయారు చేస్తున్నట్లు నటిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
ఎస్పీ నాచికేత్ విశ్వనాథ్ షెల్కే ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు తహసీల్దార్ డి. ఉదయ్ భాస్కర్ రాజు, ఏపీపీసీబీ పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (కడప) పి. చిన్నారావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ (ప్రొద్దుటూరు) పి. బసివి రెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ అధికారి జి. లక్ష్మణ్ కుమార్‌లతో కూడిన బృందం ఈ కర్మాగారాలపై దాడులు చేసి వాటిని సీజ్ చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. 2025 జనవరి 1 నుండి 2026 జూలై 6 మధ్య కడప జిల్లాలో మొత్తం 19 మంది ఈ కల్లాపి పొడిని సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పొడిలో క్యాన్సర్ కారక గుణాలు కలిగిన ఆరమైన్ ఓ(Auramine O) అనే ప్రమాదకర రసాయనం ఉంది. పొరపాటున దీనిని సేవిస్తే ప్రాణాంతకం అవుతుందని ఎస్పీ నాచికేత్ షెల్కే హెచ్చరించారు.
ఆవుపేడకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈ ప్రమాదకర రసాయనాన్ని వాడకూడదని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఇటువంటి ఉత్పత్తులను తయారు చేసే కేంద్రాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సంబంధిత శాఖకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇటీవలి కాలంలో కొందరు కల్లాపి పొడిని నీటిలో కలుపుకొని తాగి సూసైడ్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


