Kadapa Steel Plant : రాయలసీమకు మహర్దశ - కడప స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం
Kadapa Steel Plant JSW Layout : కడప జిల్లాలో రూ.16,350 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో వేలాది మందికి ఉపాధి లభించనుంది.
రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న "జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్" (JSW Rayalaseema Integrated Steel Plant) నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ సంస్థ ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. మొత్తం రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో రెండు విడతలుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.
- మొదటి విడత (Phase I): ఈ దశలో రూ.4,500 కోట్ల వ్యయంతో ప్రాథమిక నిర్మాణ పనులను పూర్తి చేస్తారు.
- రెండో విడత (Phase II): ఈ దశలో అదనంగా రూ.11,850 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.
రెండు విడతల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2 మిలియన్ టన్నులకు (2 MTPA) చేరుకుంటుంది. మార్చి 2028 నాటికి ఈ ప్లాంట్ నుంచి వాణిజ్యపరమైన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పర్యావరణహిత "గ్రీన్ స్టీల్" టెక్నాలజీ
ఈ ఉక్కు కర్మాగారాన్ని ఆధునిక పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా "గ్రీన్ స్టీల్" (Green Steel) సౌకర్యంతో రూపకల్పన చేశారు. కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు గాను, పునరుత్పాదక ఇంధనంతో (రైనేవబుల్ ఎనర్జీ) నడిచే స్క్రాప్-ఆధారిత "ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్" సాంకేతికతను ఈ ప్లాంట్‌లో ఉపయోగించనున్నారు.
వేగంగా మౌలిక సదుపాయాల కల్పన
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సజావుగా సాగడానికి అవసరమైన బాహ్య మౌలిక సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా కల్పిస్తోంది. ఫ్యాక్టరీకి అవసరమైన ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారికి అనుసంధానం చేసే రహదారి పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. వీటికి తోడు….. ప్రధాన రవాణా కోసం ప్లాంట్ నుండి ముద్దనూరు రైల్వే స్టేషన్ వరకు 12 కిలోమీటర్ల మేర ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణాన్ని పీఎం గతి శక్తి చొరవ కింద రైట్స్ సంస్థ ద్వారా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ ప్లాంట్ కోసం జిందాల్ గ్రూప్ ఏకంగా రూ.20,350 కోట్ల భారీ పెట్టుబడులను పెడుతోంది. పూర్తిగా పర్యావరణ అనుకూల పద్ధతుల్లో, సౌర విద్యుత్ (సోలార్) మరియు పవన విద్యుత్ (విండ్) ఎనర్జీ ద్వారా మొత్తం 3,850 మెగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ భారీ ఉక్కు కర్మాగారం ద్వారా రాయలసీమ ప్రాంతంలో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా….. ఈ ప్లాంట్ ఆధారంగా చుట్టుపక్కల అనేక అనుబంధ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. దేశంలోనే అగ్రగామి ఉక్కు ఉత్పత్తి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

