రైల్వే ప్రయాణికులకు అలర్ట్ … సికింద్రాబాద్ - శ్రీకాకుళం ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు!

సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే  ప్రకటించింది. ఈ పొడిగించిన సర్వీసులు జూలై నుంచి సెప్టెంబర్ 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

Published on: Jul 3, 2026, 10:08:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ (చర్లపల్లి మీదుగా) నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసుల కాలపరిమితిని మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

ప్రత్యేక రైళ్లు పొడిగింపు - వివరాలు

తాజా పొడిగింపు షెడ్యూల్ ప్రకారం….. ఈ ప్రత్యేక రైళ్లు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్ణీత తేదీలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ రైళ్ల సమయాలు , ఆగే స్టేషన్లు, కోచ్‌ల సంఖ్య నిర్వహణ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు. పాత షెడ్యూల్ ప్రకారమే ఇవి నడుస్తాయి.

  • సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ (రైల్వే నంబర్ 07425 ) : ఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. గతంలో జూన్ 28 వరకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉండేది. తాజా పొడిగింపుతో ఈ రైలు జూలై 5 నుండి జూలై 12 వరకు, తిరిగి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27, 2026 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
  • శ్రీకాకుళం రోడ్ – సికింద్రాబాద్ ( రైల్వే నంబర్ 07426 ) : ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం సర్వీసు అందిస్తుంది. గతంలో జూన్ 29తో ముగిసిన ఈ రైలు గడువును.. ఇప్పుడు జూలై 6 నుండి జూలై 13 వరకు… అలాగే తిరిగి ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం నడిచేలా పొడిగించారు.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 5 ఏసీ టూ-టైర్ కోచ్‌లు (AC 2-Tier), 4 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు (AC 3-Tier), 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్యాంట్రీ కార్, ఒక సిటింగ్-కమ్-లగేజ్ కోచ్, ఒక పవర్ కార్ అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ పొడిగించిన సర్వీసులను గమనించి తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని… టికెట్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More