SCR Train Cancellations : తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - హైదరాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు, లిస్ట్ ఇదిగో!

SCR Train Cancellations 2026 : తెలుగు ప్రయాణికులకు దక్షిమ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ - మంగళూరు, సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసింది.

Published on: Jul 2, 2026, 14:06:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SCR Train Cancellations : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. నిర్వహణాపరమైన లోపాల (ఆపరేషనల్ కన్స్ట్రైంట్స్) కారణంగా హైదరాబాద్ - మంగళూరు, సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే పలు వారంతపు ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో పొడిగించిన ఈ సర్వీసులను ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

అలర్ట్... పలు రైళ్లు రద్దు
అలర్ట్... పలు రైళ్లు రద్దు

ఈ రైళ్లు రద్దు….

రైల్వే శాఖ ప్రకటనలోని వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్లే ప్రత్యేక రైలు (నంబర్ 07097) జూలై నెలలో ప్రతి బుధవారం రద్దయింది. అంటే జూలై 8, 15, 22, 29 తేదీల్లో ఈ రైలు నడవదు. దీనివల్ల మొత్తం 4 ట్రిప్పులు రద్దయ్యాయి. ఇక తిరుగు ప్రయాణంలో మంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే రైలు (నంబర్ 07098) జూలై 9, 16, 23, 30 తేదీల్లో (ప్రతి గురువారం) ప్రయాణికులకు అందుబాటులో ఉండదు.

మరోవైపు సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలును కూడా అధికారులు పాక్షికంగా రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు (నంబర్ 07425) జూలై 19, 26 తేదీల్లో (ఆదివారాలు) నడవదు. అలాగే శ్రీకాకుళం రోడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చే తిరుగు ప్రయాణ రైలు (నంబర్ 07426) జూలై 20, 27 తేదీల్లో (సోమవారాలు) రద్దయింది. ఈ రూట్లలో ప్రయాణించే వారు తమ ప్రయాణాలను తదనుగుణంగా మార్చుకోవాలని అధికారులు సూచించారు.

ఆగస్టు నుంచి యథావిధిగా పునరుద్ధరణ

శ్రీకాకుళం మార్గంలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మరో అప్డేట్ కూడా ఇచ్చింది. జూలై నెలలో కొన్ని వారాల పాటు ఈ ట్రిప్పులను రద్దు చేసినప్పటికీ, ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రత్యేక రైలు సర్వీసులు మళ్లీ పట్టాలెక్కుతాయని స్పష్టం చేసింది.

సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ ఎక్స్‌ప్రెస్ (07425) సర్వీసులు ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి ఆదివారం యథావిధిగా కొనసాగుతాయి. అదేవిధంగా శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (07426) తిరుగు ప్రయాణ సర్వీసులు ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More