సికింద్రాబాద్ లష్కర్ బోనాలు 2026: జూలై 19 నుంచి ఉత్సవాలు, ఆగస్టు 2న ప్రధాన బోనం

హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర - 2026 ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూలై 19న ఘటోత్సవంతో ప్రారంభమై, ఆగస్టు 2న ప్రధాన బోనాల పండుగ, ఆగస్టు 3న ప్రసిద్ధ 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

Published on: Jun 17, 2026, 09:00:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ఆషాఢ మాస బోనాల జాతరకు సికింద్రాబాద్ లష్కర్ సిద్ధమవుతోంది. ప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల ఉత్సవాల పూర్తి షెడ్యూల్‌ను ఆలయ అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆలయ ఈఓ, అర్చకులు అందజేశారు.

సికింద్రాబాద్ లష్కర్ బోనాలు 2026: జూలై 19 నుంచి ఉత్సవాలు, ఆగస్టు 2న ప్రధాన బోనం
సికింద్రాబాద్ లష్కర్ బోనాలు 2026: జూలై 19 నుంచి ఉత్సవాలు, ఆగస్టు 2న ప్రధాన బోనం

లష్కర్ బోనాల జాతర - 2026 పూర్తి షెడ్యూల్:

జూలై 19 (ఆదివారం): అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) కార్యక్రమంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.

ఆగస్టు 2 (ఆదివారం): ప్రధాన బోనాల ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభిస్తారు.

ఆగస్టు 3 (సోమవారం): ఉదయం 8:30 గంటలకు ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఉదయం 10:30 గంటలకు అమ్మవారి గజవాహన సేవ, జోగినుల నృత్యాలతో లష్కర్ వీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు వైభవంగా సాగుతుంది.

అన్ని ఏర్పాట్లు చేస్తాం: పొన్నం

"తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ మంత్రితో కలిసి త్వరలోనే అన్ని శాఖల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఉత్సవాల విజయవంతానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది." అని మంత్రి తెలిపారు.

ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ లష్కర్ బోనాల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), పోలీస్, జలమండలి, విద్యుత్ శాఖలు ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More