సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు!
శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, సికింద్రాబాద్ – 2026 బోనాల జాతర కార్యక్రమాల షెడ్యూల్ విడుదలైంది. ఆ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆలయ ఛైర్మన్ ,అర్చకులు అందించారు.
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూడండి.

ముఖ్యమైన తేదీలు
అమ్మవారి ఘటోత్సవం(ఎదురుకోలు) 19-07-2026 (ఆదివారం) సాయంత్రం 4.00 గంటలకు ఉంటుంది.
ప్రధాన బోనాల ఉత్సవం 02-08-2026 (ఆదివారం) ఉదయం 4.00 గంటలకు నిర్వహిస్తారు.
రంగం కార్యక్రమం 03-08-2026 (సోమవారం) ఉదయం 8.30 గంటలకు ఉండనుంది.
అమ్మవారి గజవాహన ఊరేగింపు ఉదయం 10.30 గంటల సమయంలో నిర్వహించనున్నారు.
ఈ ఆషాఢ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆలయ అర్చకులు కోరారు. ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని త్వరలోనే ఆషాఢ మాస బోనాలకు సంబంధించి అధికారులతో దేవాదాయ శాఖ మంత్రితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
మరోవైపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆషాఢమాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు లేఖను అందజేశారు. జులై 19 వ తేదీన ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2 వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 3 వ తేదీన రంగం (భవిష్య వాణి) ఉంటాయని ఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాం మోహన్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


