గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర మధ్య ప్రత్యేక రైళ్లు.. వయా ఆంధ్రప్రదేశ్.. స్టాప్స్ ఇవి!

ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా గుజరాత్-తమిళనాడు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషట్ రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా నడుస్తాయి.

Published on: Jun 30, 2026, 16:28:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా రైల్వే బోర్డు వల్సాడ్- వేళాంకణి స్పెషల్ ట్రైన్ నెం.09030, ట్రైన్ నెం.09029 వేళాంకణి – దహను రోడ్ నడపడానికి ఆమోదం తెలిపింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

09030 వల్సాడ్-వేళాంకణి మధ్య 3 జులై 2026 మధ్య వల్సాడ్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. 10 గంటలు ప్రయాణించి మరుసటి రోజు వేళాంకణి చేరుకుంటుంది.

ట్రైన్ నెంబర్ 09029 వేళాంకణి-దహను రోడ్ 6 జులై 2026 మధ్య నడుస్తుంది. వేళాంకణిలో అర్ధరాత్రి 12.30 గంటలకు బయల్దేరి.. 10.30 గంటలు జర్నీ చేస్తుంది. మరుసటి రోజు దహను రోడ్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు దహను రోడ్, పాల్ఘర్, వసాయి రోడ్, పన్వెల్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలదుతురై, తిరునల్లారు, కారైకాల్, నాగోర్, నాగపట్టినం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ కోచ్‌లు ఉంటాయి.

కాన్పూర్ సెంట్రల్-మధురై రైళ్లు

ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి కాన్పూర్ సెంట్రల్, మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషల్ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తాయి. దీంతో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు వరంగల్, విజయవాడ మీదుగా వెళ్తాయి.

ట్రైన్ నెంబర్ 01925 కాన్పూర్ సెంట్రల్-మధురై మధ్య 01.07.2026 నుండి 29.07.2026 వరకు నడుస్తుంది. ఈ సర్వీస్ కాన్పూర్ నుంచి బుధవారం ఉదయం 8.15 గంటలకు బయల్దేరి.. శుక్రవారం 7.15కి మధురై చేరుకుంటుంది.

01926 మధురై – కాన్పూర్ సెంట్రల్ ట్రైన్ 04.07.2026 నుండి 01.08.2026 వరకు నడుస్తుంది. శనివారం ఉదయం 02.30 గంటలకు బయల్దేరి.. సోమవారం ఉదయం 04.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరాయ్, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సలీం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3 ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More