Tirumala Srivari Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. దేశవిదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా…. స్వామివారి దివ్య దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు చేపడుతున్నాయి.

ఈ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పనులపై చర్చించారు.
ప్రత్యేక హోల్డింగ్ పాయింట్లు, భారీ స్క్రీన్లు…
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహన సేవలను అందరూ ప్రశాంతంగా వీక్షించేలా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. తిరుపతి నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలతో పాటు హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు.
తిరుమలలోని రద్దీకి అనుగుణంగా తిరుపతిలోనే భక్తులను క్రమబద్ధీకరించి పంపుతారు. భక్తుల సౌకర్యార్థం హోల్డింగ్ పాయింట్ల వద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి స్వామివారి వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ఉచిత అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్ వివరించారు.
3,000 కెమెరాలు, ఏఐ సాంకేతికతతో నిఘా…
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ స్పష్టం చేశారు. తిరుమల, తిరుపతి అంతటా సుమారు 3,000 సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుంది.
అలిపిరి టోల్గేట్, అలిపిరి నడక మార్గం, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భద్రతా తనిఖీలను మరింత పటిష్టం చేశారు. అలిపిరి వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ , ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. పాత నేరస్థుల డేటాబేస్ ఆధారంగా సుమారు 1,500 మంది అనుమానితులను తక్షణమే గుర్తించే సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు.
{{/usCountry}}అలిపిరి టోల్గేట్, అలిపిరి నడక మార్గం, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భద్రతా తనిఖీలను మరింత పటిష్టం చేశారు. అలిపిరి వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ , ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. పాత నేరస్థుల డేటాబేస్ ఆధారంగా సుమారు 1,500 మంది అనుమానితులను తక్షణమే గుర్తించే సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు.
{{/usCountry}}గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు చేశామని…. టీటీడీ, పోలీసు, మున్సిపల్, రవాణా, ఆరోగ్య శాఖలు ఒకే బృందంగా పనిచేసేలా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
సోషల్ మీడియాలో వ్యాపించే ప్రచారాలు, సమాచారంపై తక్షణమే స్పందించేందుకు ఒక ప్రత్యేక రెస్పాన్సివ్ టీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములను సిద్ధంగా ఉంచారు.