ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు బోగీల్లో 158 మంది..
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటలు చెలరేగాయి. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం ఘటనపై అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అగ్నిప్రమాదం గురించి తమకు అర్ధరాత్రి 12:45 గంటలకు సమాచారం అందిందని చెప్పారు.

అగ్ని ప్రమాదంలో B1, M2 కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. రైల్వే అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకుని ప్రయాణికులను రైలు నుంచి కిందకు దిగబెట్టడంలో సహాయం చేశారు.
రైలులో మంటలు చెలరేగినప్పుడు ప్రభావితమైన ఒక కోచ్‌లో 82 మంది ప్రయాణికులు, మరో కోచ్‌లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు మీడియాకు వెల్లడించారు. దురదృష్టవశాత్తు B1 కోచ్ నుండి ఒక మృతదేహం లభ్యమైంది అన్నారు. మృతుడిని చంద్రశేఖర్ సుందరంగా గుర్తించారు. దెబ్బతిన్న రెండు కోచ్‌లను రైలు నుండి వేరు చేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపే ప్రయత్నంలో ఉన్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి రెండు ఫోరెన్సిక్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సహాయం, రైలు సమాచారం మొదలైన వాటిని అందించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేశారు.
ఎలమంచిలి - 7815909386
అనకాపల్లి - 7569305669
తుని - 7815909479
సామర్లకోట - 7382629990
రాజమండ్రి - 0883-2420541/43
ఏలూరు - 7569305268
విజయవాడ -0866 - 2575167
పలు రైళ్లు ఆలస్యం
విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్, బెంగళూరు హంసఫర్, షాలిమార్-చర్లపల్లి(18045), విశాఖ-లింగంపల్లి(12805), విశాఖ-గుంటూరు(17240) రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యం అయ్యాయి.
ఇక విశాఖకు రావాల్సిన గోదావరి, తిరుపతి-హావ్‌డా రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎలమంచిలి స్టేషన్‌లో స్టాప్ ఉన్న రైళ్లను రాకుండా ఆపుతున్నారు. ఇక స్టాప్ లేకుండా ఉన్నవాటిని పంపిస్తున్నారు. సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ల కోసం రైళ్లు పెద్ద ఎత్తున చూస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


