alla nani passed away : గుండెపోటుతో మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి
alla nani passed away : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మరణించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. మాజీ వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు మాజీ శాసనసభ్యుడు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆయన గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్తితి చేయి దాటిపోయింది. ఆళ్ల నాని తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు దృవీకరించారు. ఆయన అకాల మరణం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆళ్ల నాని తనదైన ముద్ర వేశారు. ప్రజలతో నిరంతరం మమేకమయ్యే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఏలూరు నియోజకవర్గం నుంచి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎమ్మెల్సీగా కూడా పని చేశారు.
ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ అందించారు. 2019 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆళ్ల నాని కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ నిర్ణయాల్లో చురుగ్గా వ్యవహరించారు. వైద్యా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, కోవిడ్-19 పాండమిక్ సమయంలో నిరంతరం శ్రమిస్తూ వైద్యా సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2025లో టీడీపీలో చేరారు ఆళ్ల నాని.
ఆళ్ల నాని ఆకస్మిక మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు, అభిమానులు సంతాపాన్ని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం తెలిపారు. నాని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


