ఏపీ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ - ఈనెల 11న పేరును ప్రకటించనున్న విజయసాయిరెడ్డి
Vijaysai Reddy New Party : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతోంది. నవంబర్ 11న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు.
Vijaysai Reddy New Party : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం స్పష్టమైన శూన్యత కనిపిస్తోందని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా నవంబర్ 11న ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణే ముఖ్యాంశాలుగా తమ నూతన పార్టీ నడుస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 11న పార్టీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేయడం వెనుక ఎలాంటి ఇతర వ్యూహాలు లేవని, పురోహితులు నిర్ణయించిన శుభ ముహూర్తం ప్రకారమే ఆ తేదీని ఎంచుకున్నామని ఆయన వెల్లడించారు.
"ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ రెండింటి తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రెండు పార్టీలతో విసిగిపోయిన ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికే మేము నవంబర్ 11న కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయించాం," అని శుక్రవారం పీటీఐ (PTI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి తెలిపారు.
ఆ 2 పార్టీలు విఫలం - విజయసాయిరెడ్డి
రాష్ట్రంలో వరుసగా పరిపాలించిన ప్రభుత్వాల తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాంతిభద్రతల నిర్వహణతో పాటు కీలక రంగాల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు గణాంకాలను బయటపెట్టారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి రూ. 1 లక్ష కోట్లుగా ఉన్న బహిరంగ అప్పులు…. ఇప్పుడు ఏకంగా రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిపై సగటున రూ. 5.5 లక్షల అప్పు భారం పడిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంతో సమన్వయం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యం!
తమ కొత్త పార్టీ ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను కాపాడటమేనని విజయసాయిరెడ్డి చెప్పారు. ఢిల్లీలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ ఏపీ ప్రజలకు దక్కాల్సిన న్యాయాన్ని, నిధులను రాబట్టడానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వివరించారు.
ఒకప్పుడు వైఎస్సార్సీపీలో అత్యంత కీలక నాయకుడిగా వెలుగొందిన విజయసాయిరెడ్డి…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించేవారు. అయితే ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన ఆయన…. ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని ప్రకటిస్తుండటం తెలుగు రాష్ట్రాల రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

