SCR Festival Trains : ఆంధ్రా మీదుగా యశ్వంత్‌పూర్ - బీదర్ ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ ఇలా
South Central Railway Festival Trains : పండుగల వేళ ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు యశ్వంత్‌పూర్ - బీదర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి.
South Central Railway Festival Trains : పండుగల సీజన్ ప్రారంభం కావడంతో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని యశ్వంత్‌పూర్, బీదర్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం…. యశ్వంత్‌పూర్ – బీదర్ – యశ్వంత్‌పూర్ (ట్రైన్ నంబర్లు 06589 / 06590) ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
టైమింగ్స్ వివరాలు :
- యశ్వంత్‌పూర్ - బీదర్ (ట్రైన్ నంబర్ 06589): ఈ ప్రత్యేక రైలు శుక్రవారం, సెప్టెంబర్ 11, 2026న యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి బీదర్ చేరుకుంటుంది.
- బీదర్ - యశ్వంత్‌పూర్ (ట్రైన్ నంబర్ 06590): తిరుగు ప్రయాణంలో ఈ రైలు శనివారం, సెప్టెంబర్ 12, 2026న బీదర్ నుంచి బయలుదేరి యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
హాల్టింగ్ లిస్ట్…
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే సమయంలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక పరిధిలోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, వాడి, షాహాబాద్, కలబుర్గి, హోమ్నాబాద్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం నిలుస్తాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో 2AC (సెకండ్ ఏసీ), 3AC (థర్డ్ ఏసీ), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. సొంత ఊళ్లకు ప్రయాణించేవారు, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

