శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం - జలాశయంలో మునిగి ఐదుగురు మహిళలు మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఐదుగురు మహిళలు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Published on: Oct 16, 2026, 19:06:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెనుకొండ మండలం పరిధిలోని గొల్లపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఐదుగురు మహిళలు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం (Image Source Pixel )
శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం (Image Source Pixel )

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. దర్గాపేటకు చెందిన గాయత్రి (50), ఆమె కుమార్తె అశ్విని, వారి ఇరుగుపొరుగు స్నేహితులు పుష్ప, హసీనా, మహిన్‌తో కలిసి శుక్రవారం సరదాగా గొల్లపల్లి జలాశయాన్ని చూడటానికి వెళ్లారు. మధ్యాహ్నం వేళ డ్యామ్ వద్ద అందరూ కలిసి భోజనాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం సరదాగా గడిపేందుకు జలాశయం నీటిలోకి దిగారు. అయితే నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా లోతుల్లోకి జారిపోయి మునిగిపోయారు.

విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో నుంచి ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, అక్కడ చేపడుతున్న సహాయక చర్యల గురించి స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

గొల్లపల్లి జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లి ఐదుగురు మహిళలు మృత్యువాత పడటం చాలా బాధాకరమని మంత్రి లోకేశ్ అన్నారు. “మృతులకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది” అని హామీనిచ్చారు.

ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మహిళలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More