గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఇందులో భాగంగా పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం ఉదయానికే వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. ఆలయ పరిసరాలతో పాటు అమ్మవారి అంతరాలయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అధికారులు, అర్చకులు అప్రమత్తమయ్యారు.

గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయంలోని అమ్మవారి విగ్రహం వరకు వరద నీరు చేరింది. ఆలయ ప్రాంగణం, ముఖ్య మండపం, భక్తులు వెళ్లే క్యూలైన్లు అన్నీ నీటమునిగాయి. ఈ పరిణామంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అమ్మవారి దర్శనాలను తక్షణమే నిలిపివేశారు.
గోదావరిలో వరద ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు భక్తులందరూ అధికారులకు సహకరించాలని, క్షేత్ర సందర్శనకు ఎవరూ రావద్దని ఈఓ విజ్ఞప్తి చేశారు. వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆలయం సమీపంలో ఉన్న పూజా సామగ్రి, ఇతర వ్యాపార దుకాణాల్లోకి కూడా నీరు చేరింది. దీంతో స్థానిక వ్యాపారులు తమ వస్తువులను సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేసి వెళ్లారు.
డి.రావిలంక - దండంగి గ్రామాల మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిని గోదావరి వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. రహదారిపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే అన్ని రకాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఏజెన్సీ వాసులు జాగ్రత్తగా ఉండాలని స్థానిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
పోలవరం నుంచి నీటి విడదల…
మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. గేట్ల ద్వారా నీటిని దిగువుకు విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో… లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
{{/usCountry}}మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. గేట్ల ద్వారా నీటిని దిగువుకు విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో… లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
{{/usCountry}}