ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఆఫీసులు - 25 భవనాలకు శంకుస్థాపన
అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. వీటిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరయ్యారు.
ఏపీ రాజధాని అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరయ్యారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలున్నాయి.
అద్భుతంగా నిర్మించండి - సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారన్నారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి అని వ్యాఖ్యానించారు.
“రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారు రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం. బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరిట బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం అమరావతిలో స్థలం కేటాయించాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆప్కాబ్, నాబార్డ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లు వచ్చాయి. ఈ సంస్థలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను అద్భుతంగా నిర్మించాలని కోరుతున్నాను” అని విజ్ఞప్తి చేశారు.
“ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్ధిక మంత్రులు. మన దేశానికి కూడా మహిళా ఆర్ధిక మంత్రే ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ పెరగటంతో పాటు సామాన్యులకూ లబ్ది కలిగింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ఓ కాస్మోస్ ప్లానెటోరియం నిర్మాణానికి ఒప్పందం జరిగింది. ప్లానెటోరియం ఏర్పాటు చేసేందుకు అమరావతిలో స్థలం కూడా కేటాయించాం. ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థ, గతంలో విభజన వల్ల జరిగిన నష్టాల నుంచి ఇప్పుడే గాడిన పడుతున్నాం”అ సీఎం చంద్రబాబు తెలిపారు.
త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి…
త్వరలోనే సీడ్ యాక్సెస్ రహదారి కూడా పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2028 కల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయని 7 జాతీయ రహదారులు, రైల్వేలైన్లు అమరావతికి కనెక్టు అవుతాయన్నారు. అమరావతి పూర్తిగా గ్రీన్, బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భారతదేశం గర్వపడేలా అమరావతిని నిర్మాణం చేస్తామని ఉద్ఘాటించారు.
“పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ ద్వారా నీళ్లు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలు వాడుకుని దేశసంపద పెంచేలా రాయలసీమకు నీళ్లు పారించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్టటంలో ఈ నీరు కీలకం అవుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కేంద్ర సహకారం వల్ల చాలా వరకూ రాష్ట్రం రికవర్ అవుతోంది. కేంద్ర సహకారంతో అమరావతి అన్ స్టాపబుల్” అని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

