నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే జోగి రమేశ్ ఇంటికి అధికారులు చేరుకోగా… చాలాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసుల పర్యవేక్షణలో ఆయన నివాసం నుంచి తరలించారు.

కొద్దిరోజుల కిందట ఇబ్రహీంపట్నం, ములకలచెరువులలో నకిలీ మద్యం తయారీ డంప్‌లు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జనార్దన్‌రావు ఉన్నాడు. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేయగా…. పోలీసులు కస్టడీకి కూడా తీసుకున్నారు. కస్టడీలో ఇచ్చిన వివరాల ఆధారంగా జోగి రమేశ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
జనార్దన్‌రావు నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఓ వీడియో కూడా కొద్దిరోజుల కిందట విడుదలైంది. జోగి రమేశ్ ఆదేశాల మేరకే నకిలీ మద్యాన్ని తయారీ చేసినట్టు జనార్థన్ రావు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే కేసులో ఇరుక్కున్న తర్వాత తమను పట్టించుకోలేదని ఆరోపించారు.
జోగి రమేశ్ అరెస్ట్ తో నకిలీ మద్యం కేసులో అరెస్టుల సంఖ్య 20కి చేరింది. ఈ కేసులో జోగి రమేష్ను ఏ18గా చేర్చే అవకాశాలున్నాయి.
ఖండించిన వైసీపీ నేతలు…
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ను వైసీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు ఆ పార్టీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్‌బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
“మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కల్తీ మద్యం కేసులో జోగిరమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. లేని లిక్కర్ స్కామ్‌లు సృష్టించారు" అని పేర్కొన్నారు.
{{/usCountry}}“మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కల్తీ మద్యం కేసులో జోగిరమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. లేని లిక్కర్ స్కామ్‌లు సృష్టించారు" అని పేర్కొన్నారు.
{{/usCountry}}“కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైయస్సార్‌సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ సీబీఐ దర్యాప్తునకు కూడా కోరారు. దానిపై హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట. పలువురి దుర్మరణం, మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాల్లో డైవర్షన్ కోసమే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం” అని వైసీపీ నేతలు హెచ్చరించారు.