మద్యం షాపులకు లక్కీ డ్రాలో లక్కు.. మూడు వైన్స్ దుకాణాలతో హ్యాట్రిక్ కిక్కు!
తెలంగాణలో మద్యం షాపుల లక్కీ డ్రాలో కొన్ని ఆసక్తికర సన్ని వేశాలు జరుగుతున్నాయి. కలిసి టెండర్లు వేసిన కొందరికి వరుసగా లక్కు తగులుతోంది.
తెలంగాణలో వైన్స్ షాపుల టెండర్ల గురించి ఆశావహులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 27వ తేదీన లక్కీ డ్రా ఉదయం ముదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఆసక్తికరంగా కొందరికి మద్యం షాపుల లక్కీ డ్రాలో లక్కు ఎక్కువగా కలిసి వస్తుంది. ఎందుకంటే కొందరు కలిసి టెండర్లు వేశారు. అంటే ఎక్కడ టెండర్ తగిలినా.. దానిలో సమానంగా ఉంటుంది. ఇలా కొంతమంది కలిసి టెండర్లు వేస్తారు. లక్కీ డ్రాలో లైసెన్స్ వస్తే.. అంతా సమానంగా ఉంటారు. అయితే కొందరికి లక్కీ డ్రాలో మూడు షాపులు కూడా కలిసి వచ్చాయి.

సంగారెడ్డిలో కె.వంశీధర్ రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి 100కి పైగా దరఖాస్తులు దాఖలు చేశాడు. పటాన్‌చెరులో మూడు మద్యం దుకాణాల లైసెన్స్‌లను పొందాడు. కేటాయించిన మూడు అవుట్‌లెట్‌లు అతడి పేరు మీదకు రావడంతో ముగ్గురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 100కి పైగా దరఖాస్తులు దాఖలు చేశారు వీరు. పటాన్‌చెరు ప్రాంతంలో మూడు వైన్ షాపుల లైసెన్స్‌లను పొందగలిగారు.
సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో మద్యం దుకాణాల టెండర్ల కోసం లాట్ల డ్రా నిర్వహించారు. దరఖాస్తుదారుడు కె. వంశీధర్ రెడ్డి, అతని స్నేహితులు హరీష్, మురళి సంయుక్తంగా 100 కి పైగా దరఖాస్తులను సమర్పించారు. ఆసక్తికరంగా వారు గెలుచుకున్న మూడు దుకాణాలు వంశీధర్ రెడ్డి పేరుతో నమోదు అయ్యాయి. నంబర్ 32, 34, 40 వారికి వచ్చాయి.
మరోవైపు ఇదే జిల్లాలో వైన్స్ టెండర్ ప్రక్రియలో ఇంకో ఆసక్తికర సన్నివేశం వెలుగుచూసింది. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నరసింహ గౌడ్, దిపీల్ గౌడ్, ప్రభు గౌడ్ కలిపి సిండికేట్‌గా టెండర్లు వేశారు. వారికి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షాప్ నెంబర్ 82, 83, 84 వరుసగా తగిలాయి. మూడు షాపలకు లక్కీ డ్రా తీయగా టోకెన్ ద్వారా ఆ షాపులు వీరికి వచ్చాయి. వరుసగా హ్యాట్రిక్ కిక్కు వీరి సొంతమైంది. దీంతో వారికి ఆనందానికి అవధుల్లేవ్.
తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించింది ప్రభుత్వం. గురువారం గడువు ముగిసే సమయానికి 95 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున, నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో సహా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీసు పరిమితుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి.
రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో 2,620 ఏ4 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు మంజూరు చేయడానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చివరి తేదీని అక్టోబర్ 23 వరకు పొడిగించారు. చివరి రోజున దరఖాస్తులు భారీగా పెరిగాయి. శంషాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, నల్గొండ వంటి ప్రాంతాల్లో అత్యధిక దరఖాస్తులు చివరిరోజున వచ్చాయి. తాజాగా అక్టోబర్ 27న లక్కీ డ్రా నిర్వహించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


