తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు అప్లయ్ చేశారా...? దగ్గరపడిన దరఖాస్తుల గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి..!

టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే అప్లికేషన్ల గడువు  మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. కాబట్టి ఈనెల 28లోపు అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Oct 26, 2025, 13:04:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల గడువు దగ్గరపడింది. కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవావాల్సి ఉంటుంది.

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు

నోటిఫికేషన్ లో భాగంగా 1743 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటిల్లో డ్రైవర్‌ కొలువులు 1,000, శ్రామిక్‌ పోస్టులు 743 ఉన్నాయి. ఈ పోస్టుల నియామకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు అప్పగించారు. ఆన్ లైన్ దరఖాస్తుల నుంచి అభ్యర్థులకు సంబంధిత పరీక్షలతో పాటు తుది ఫలితాల విడుదల ప్రక్రియ అంతా కూడా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డే పర్యవేక్షిస్తోంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం ఇలా….

  1. అభ్యర్థులు ముందుగా https://www.tgprb.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.
  2. హోం పేజీలో డ్రైవర్, శ్రామిక్ నోటిఫికేషన్ 2025 అని ఉంటుంది. దీని కిందనే అప్లయ్ ఆన్ లైన్ అనే లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  3. ముందుగా మీ ప్రాథమిక వివరాలతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శ్రామిక్ పోస్టులకు రూ.200, ఇతరులు అయితే రూ.400 దరఖాస్తు ఫీజు ఉంటుంది.
  5. అప్లికేషన్ ప్రక్రియ కోసం డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా టెన్త్ మెమో, ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణపత్రంతో పాటు మరికొన్ని వివరాలకు సంబంధించిన పత్రాలు ఉండాలి.
  6. చివరగా సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఫిజికల్ మెజర్‌మెంట్, మెడికల్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం డ్రైవర్ పోస్టులకు నెలకు రూ. 20,960 నుంచి రూ.60,080 వరకు ఉంటుంది. శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 జీతం చెల్లిస్తారు.

ఇక ఎస్సీ అభ్యర్థులు వర్గీకరణ (గ్రేడ్ 1,2,3) ప్రకారం కొత్త ఫార్మాట్‌లో కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ వివరాలను https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్ లో చూడొచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More