తెలంగాణ ఆర్టీసీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత..! ఆమె నేపథ్యం ఇదే
తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా మహిళా డ్రైవర్ వచ్చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత విధుల్లోకి చేరారు. తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపారు. ఆమెకు పలువురు మంత్రులతో పాటు ఆర్టీసీ అధికారులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా మహిళా డ్రైవర్ ను నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సీత్య తండాకు చెందిన సరిత విధుల్లో చేరారు. శనివారం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సును నడిపారు. సరిత నియామకంపై రాష్ట్ర ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.

మహిళా డ్రైవర్ గా సరిత - ముఖ్యమైన విషయాలు:
- తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత నియమితులయ్యారు.
- సరితది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సీత్య తండా.
- రాంకోటి, రుక్కా దంపతుల ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి సరిత. దేవరకొండలో 8వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఓపెన్ టెన్త్ లో పాసయ్యారు.
- తొలుత ఆటో నడపటాన్ని సరిత నేర్చుకున్నారు. దాదాపు ఐదేండ్ల పాటు సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో ఆటోను నడిపారు. ఆ తర్వాత హైదరాబాద్ కు కారు డ్రైవింగ్, బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు.
- ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావటంతో దరఖాస్తు చేసుకున్న సరిత… ఉద్యోగానికి ఎంపికయ్యారు. గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహించారు.
- ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2018లో నాటి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.
- సరిత ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించగా… కుటుంబ పరిస్థితుల కారణంగా స్వరాష్ట్రానికి రావాలని నిర్ణయించుకున్నారు. తన స్వస్థలంలో డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని ఇటీవల సరిత పలువురు మంత్రులతో పాటు టీజీఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
- సరిత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం… ఆమెకు ఉద్యోగం ఖరారు చేశారు.
- మిర్యాలగూడ డిపో లో జేబీఎం సంస్థ నుంచి తెలంగాణ ఆర్టీసీఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్ గా జూన్ 14వ తేదీన విధుల్లో చేరారు. హైదరాబాద్ - మిర్యాలగూడ మధ్య బస్సును నడుపుతున్నారు.
- సరితకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని సరిత నిరూపించారని ప్రశంసించారు.
- సరిత నియామకం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.మహిళా సాధికారత దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు వేస్తోందని చెప్పారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


