Dhanteras Wishes 2025: మీ స్నేహితులకు, బంధువులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు.. ఇలా చెప్పేయండి!
ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బుతో, సంపదతో సంతోషంగా ఉంటారని నమ్మకం. ఆ రోజు మీతో పాటు మీ స్నేహితులు, బంధువులు కూడా లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మరి ధన త్రయోదశి నాడు స్నేహితులకు, బంధువులకు మంచి జరగాలని ఈ విషెస్‌ను పంచుకోండి.
పిల్లలు, పెద్దలు అందరూ దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. దీపావళిని ఐదు రోజులు పాటు జరుపుతారు. ధన త్రయోదశి నుంచి మొదలవుతుంది. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు. అలాగే ధన త్రయోదశి నాడు ధన్వంతరి, కుబేరులను కూడా ఆరాధిస్తారు. అలా ఆరాధించడం వలన సంపద, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.

ధన త్రయోదశి 2025
ధన త్రయోదశి నాడు సాయంత్రం యమ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం వలన అపమృత్యు దోషాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. అలాగే ఈరోజు ధన్వంతరి జయంతిగా, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా చెప్తారు. అందుకని లక్ష్మీదేవి ఆవిర్భావానికి చిహ్నంగా వెండి, బంగారం మొదలైనవి కొనుగోలు చేస్తారు.
ధన త్రయోదశి విషెస్
ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బుతో, సంపదతో సంతోషంగా ఉంటారని నమ్మకం. ఆ రోజు మీతో పాటు మీ స్నేహితులు, బంధువులు కూడా లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మరి ధన త్రయోదశి నాడు మీ స్నేహితులకు, బంధువులకు మంచి జరగాలని ఈ విషెస్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా పంచుకోండి. లక్ష్మీదేవి ఇంతటి ఆనందాన్నిచ్చే శుభ దినాన వారు కూడా సంతోషంగా ఉండాలని ఈ విషెస్ ని మనస్ఫూర్తిగా షేర్ చేసేసుకోండి.
ధన త్రయోదశి 2025 విషెస్, ధన త్రయోదశి శుభాకాంక్షలు
మీ ఇంట్లో ధాన్యాలు, సంపద కురవాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలి. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, మీ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషాలు, ప్రేమలు, ఆనందం నెలకొనాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు!
మీ కోరికలన్నీ నెరవేరాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలని కోరుకుంటూ.. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
మీ ఇంటికి ఐశ్వర్యం రావాలి, నిత్యం సంతోషం మీతోనే ఉండాలని ప్రార్థిస్తూ.. ధన త్రయోదశి శుభాకాంక్షలు!

మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు!
ధన త్రయోదశి సందర్భంగా మీ అందరికీ ప్రయోజనాలు కలగాలని కోరుకుంటూ.. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
ఆ లక్ష్మీదేవి మీకు, మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ.. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
మహాలక్ష్మి కరుణాకటాక్షాలు, ఆయురారోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
ఈ ధన త్రయోదశి మీకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విజయాలను అందించాలని ఆశిస్తూ ధన త్రయోదశి శుభాకాంక్షలు!
కొత్త కలలు, కొత్త ఆశలు నెరవేరి, మీ జీవితంలో వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తున్నాను. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


