రేపే ధన త్రయోదశి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలంటే ఈ పొరపాట్లు చేయకండి, ఎంతో నష్టం కలగవచ్చు!
ఈసారి ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చాలా మంది రకరకాల పరిహారాలను పాటిస్తారు. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుతారు. పొరపాటున కూడా ధన త్రయోదశి నాడు ఈ తప్పులు చేయకండి. పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ధన త్రయోదశి సందర్భంగా కొన్ని పరిహారాలను పాటించడం, కొన్ని తప్పులను చేయకుండా చూసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ధన త్రయోదశి నుంచి దీపావళి పండుగ మొదలవుతుంది.

దీపావళి పండుగను ఐదు రోజులు పాటు జరుపుతారు. ఆ రోజున ధన్వంతరి దేవుడిని, లక్ష్మీదేవిని, కుబేరుని పూజిస్తారు. అలా చేయడం వలన సకల సంతోషాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులకి అవకాశమే ఉండదని నమ్ముతారు. డబ్బుతో, సంపదతో సంతోషంగా ఉంటారు.
ధన త్రయోదశి తేదీ
ఈసారి ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చాలా మంది రకరకాల పరిహారాలను పాటిస్తారు. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుతారు.
మత విశ్వాసాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన త్రయోదశి నాడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే రకరకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ధన త్రయోదశి నాడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పొరపాటున కూడా ధన త్రయోదశి నాడు ఈ తప్పులు చేయకండి
1. సాయంత్రం ఇల్లు తుడవద్దు:
సూర్యాస్తమయం అయిన తర్వాత ధన త్రయోదశి నాడు ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం వంటి పొరపాట్లు చేయకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ముఖద్వారం ఎదురుగా తుడవడం వంటివి చేయకండి.
2. సాయంత్రం ఎవరికీ ఉప్పు ఇవ్వద్దు:
ఎప్పుడూ పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత ఉప్పు, పెరుగు, పుల్లటి ఆహార పదార్థాలను ఎవరికీ ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యంగా ధన త్రయోదశి నాడు కూడా వీటిని ఎవరికి ఇవ్వకండి. అలా చేసినట్లయితే ఇంట్లో టెన్షన్లు పెరిగిపోతాయి, రాహువు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
3. తలుపులు మూసి వేయకండి:
ధన త్రయోదశి నాడు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అలాంటి సమయంలో తలుపులు మూసి వేయడం వంటివి చేయకూడదు. దీపాలు వెలిగించడం, లైట్లు వేయడంతో పాటు తలుపులు తెరిచి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులకి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
4. డబ్బు అప్పుగా ఇవ్వకండి:
ధన త్రయోదశి నాడు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే కుబేరుడికే కోపం వస్తుందని, లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.
5. ఖాళీ సామాన్లు ఇంటికి తీసుకురావద్దు:
ధన త్రయోదశి నాడు రాగి, కంచు పాత్రలు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. అయితే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురావద్దు. నీళ్లు, బియ్యం, బెల్లం, పంచదార వంటి వస్తువులను వేసి ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


