ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఎంబీబీఎస్ అడ్మిషన్లలో అమ్మాయిలు సత్తా చాటారు. 60.72 శాతం అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66 శాతం అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు.

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ఇటీవల ముగిశాయి. వీటి వివరాలను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి మంత్రికి సత్యకుమార్ కు నివేదించారు.
ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం...2023-24లో 57.06 శాతం, 2024-25లో 57.96 శాతం, 2025-26లో 60.72% మంది చొప్పున అమ్మాయిలు ఎంబీబీఎస్ లో చేరినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పాఠశాల విద్య నుంచే అమ్మాయిలు నీట్ (NEET) లో ఉత్తమ ర్యాంకు సాదించేందుకు పుస్తకాలతో మమేకమవుతున్నారని చెప్పారు. అందువల్లే వారికి నీట్ (NEET) లో వచ్చే ఉత్తమ ర్యాంకుల వస్తున్నాయని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే మెజార్టీ సీట్లు దక్కించుకుంటున్నారని పేర్కొన్నారు. 2024-25తో పోల్చితే అబ్బాయిల ప్రవేశాలు 3.66 శాతం తగ్గాయని గుర్తుచేశారు.
యాజమాన్య కోటా సీట్లలోనూ పైచేయి…!
కన్వీనర్ కోటాలోనే కాకుండా..యాజమాన్య కోటాలోనూ అమ్మాయిలే ప్రవేశాలే అధికంగా ఉండడం గమనార్హం. 2025-26 విద్యా సంవత్సరంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,430 ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద అమ్మాయిలు 2,617, అబ్బాయిలు 1,638 చొప్పును సీట్లు దక్కించుకున్నారు.
ఇదే విధంగా యాజమాన్య కోటాలో అమ్మాయిలు 1,287, అబ్బాయిలు 888 మంది చొప్పున ప్రవేశాలు పొందారని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి వివరించారు. దీని ప్రకారం కన్వీనర్ కోటాలో 61.50 శాతం, మేనేజ్మెంటు కోటాలో 59.17 శాతం చొప్పున అమ్మాయిలు సీట్లు దక్కించుకున్నారు.
{{/usCountry}}ఇదే విధంగా యాజమాన్య కోటాలో అమ్మాయిలు 1,287, అబ్బాయిలు 888 మంది చొప్పున ప్రవేశాలు పొందారని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి వివరించారు. దీని ప్రకారం కన్వీనర్ కోటాలో 61.50 శాతం, మేనేజ్మెంటు కోటాలో 59.17 శాతం చొప్పున అమ్మాయిలు సీట్లు దక్కించుకున్నారు.
{{/usCountry}}