మారేడుమిల్లికి వెళ్లిన విద్యార్థులను ప్రశ్నించిన పోలీసులు.. అక్కడ మావోయిస్టుల కదలికలు!
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు కీలక నేత హిడ్మా సహా పలువురి ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి నిజనిర్ధారణ పర్యటనకు విద్యార్థులు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఉస్మానియా, కాకతీయ యునివర్సిటీ నుంచి విద్యార్థులు నిజనిర్ధారణకు వెళ్లారు. ఈ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చింతూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఎనిమిది మంది విద్యార్థులను పోలీసులు ప్రశ్నించారని శనివారం ఒక అధికారి తెలిపారు. వారందరినీ తరువాత వెళ్ళడానికి అనుమతించారని అన్నారు.

'ఆపరేషన్ సంభవ్' కింద పోలీసులు రెండు రోజుల్లో 13 మంది మావోయిస్టులను అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో కాల్చి చంపారు. నవంబర్ 18న ఆరుగురు, నవంబర్ 19న ఏడుగురు మరణించారు. 'విద్యార్థులను అదుపులోకి తీసుకోలేదు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పరిశీలించారు.' అని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ) అమిత్ బర్దార్ పీటీఐకి తెలిపారు.
శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన విద్యార్థులు పోలీసులకు సహకరించారని ఎస్పీ వెల్లడించారు. అయితే విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల కాంటాక్ట్ చేసేందుకు వివరాలను అడిగితే పంచుకోవడానికి నిరాకరించారని చెప్పారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగిన సమయంలో విద్యార్థుల సేఫ్టీ గురించి పోలీసులు వారికి తెలియజేయాలని కోరారని అన్నారు.
'ఒడిశా సరిహద్దులో ఇప్పుడు భారీగా మావోయిస్టు కదలిక ఉందని మాకు సమాచారం ఉంది. ఛత్తీస్‌గఢ్ నుండి ఒడిశాలోకి కొంతమంది వచ్చారు.' అని ఎస్పీ బర్దార్ అన్నారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విద్యార్థులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఇటీవలి రోజుల్లో మావోయిస్టుల ద్వారా సమస్యలు ఎదుర్కొన్న కుటుంబాలు, అభివృద్ధి కోసం చూసే సంఘాలు నిరసనలు, ర్యాలీలు నిర్వహించాయన్నారు.
గ్రామస్తులు విద్యార్థులపై దాడి చేసే అవకాశం ఉండటంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ గురించి వాస్తవాలను తెలుసుకుని వాటిని బహిరంగంగా వెల్లడించడానికి మారేడుమిల్లి పర్యటనకు సంబంధించి కొన్ని రోజుల క్రితం బహిరంగ లేఖను విడుదల చేసినట్లు విద్యార్థులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ స్థలాన్ని సందర్శించడానికి తమకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


