ఆంధ్రప్రదేశ్ : ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో అమ్మాయిలదే హవా..! పెరిగిన ప్రవేశాల శాతం

ఏపీలో ఎంబీబీఎస్‌ సీట్లను అత్యధికంగా అమ్మాయిలే దక్కించుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించిన ప్రవేశాల్లో 60.72 శాతం సీట్లు అమ్మాయిలకే దక్కాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి అమ్మాయిల ప్రవేశాలు 3.66 శాతం పెరిగాయి.

Published on: Dec 07, 2025 12:52 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఎంబీబీఎస్ అడ్మిషన్లలో అమ్మాయిలు సత్తా చాటారు. 60.72 శాతం అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66 శాతం అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు.

ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో అమ్మాయిలదే హవా..! (image source pixabay)
ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో అమ్మాయిలదే హవా..! (image source pixabay)

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ఇటీవల ముగిశాయి. వీటి వివరాలను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి మంత్రికి సత్యకుమార్ కు నివేదించారు.

ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం...2023-24లో 57.06 శాతం, 2024-25లో 57.96 శాతం, 2025-26లో 60.72% మంది చొప్పున అమ్మాయిలు ఎంబీబీఎస్ లో చేరినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పాఠశాల విద్య నుంచే అమ్మాయిలు నీట్ (NEET) లో ఉత్తమ ర్యాంకు సాదించేందుకు పుస్తకాలతో మమేకమవుతున్నారని చెప్పారు. అందువల్లే వారికి నీట్ (NEET) లో వచ్చే ఉత్తమ ర్యాంకుల వస్తున్నాయని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే మెజార్టీ సీట్లు దక్కించుకుంటున్నారని పేర్కొన్నారు. 2024-25తో పోల్చితే అబ్బాయిల ప్రవేశాలు 3.66 శాతం తగ్గాయని గుర్తుచేశారు.

యాజమాన్య కోటా సీట్లలోనూ పైచేయి…!

కన్వీనర్ కోటాలోనే కాకుండా..యాజమాన్య కోటాలోనూ అమ్మాయిలే ప్రవేశాలే అధికంగా ఉండడం గమనార్హం. 2025-26 విద్యా సంవత్సరంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,430 ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద అమ్మాయిలు 2,617, అబ్బాయిలు 1,638 చొప్పును సీట్లు దక్కించుకున్నారు.

ఇదే విధంగా యాజమాన్య కోటాలో అమ్మాయిలు 1,287, అబ్బాయిలు 888 మంది చొప్పున ప్రవేశాలు పొందారని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి వివరించారు. దీని ప్రకారం కన్వీనర్ కోటాలో 61.50 శాతం, మేనేజ్మెంటు కోటాలో 59.17 శాతం చొప్పున అమ్మాయిలు సీట్లు దక్కించుకున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More