...
...
Next Story

కృష్ణా డెల్టా రైతులకు గోదారమ్మ భరోసా.. పట్టిసీమ నుంచి జలాలు!

కృష్ణా డెల్టా రైతులకు గోదారమ్మ భరోసాగా నిలుస్తోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక అయోమయంలో ఉన్న అన్నదాతలకు పట్టిసీమ నీటి విడుదల ఎంతో ఉపశమనం ఇచ్చింది.

Published on: Jul 13, 2026, 09:24:16 IST
Advertisement

రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో కృష్ణా డెల్టా పరిధిలోని సాగు నీటి కష్టాలపై ఆందోళన నెలకొంది. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా డెల్టా రైతులకు వరప్రదాయినిగా మారింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ద్వారా పంటలను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు
కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు

జూలై 1వ తేదీన పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసినప్పటికీ ఆ ప్రవాహం సాగు అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు. ఈ నేపథ్యంలో పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టాలు పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు పంపింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించారు.

పట్టిసీమ ప్రాజెక్టులో మొత్తం 24 పంపులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గరిష్టంగా 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చు. ప్రస్తుతం ఇందులో 20 పంపులను నిరంతరాయంగా నడుపుతూ, సుమారు 7,080 క్యూసెక్కుల నీటిని కృష్ణా కాలువల్లోకి పంపింగ్ చేస్తున్నారు. పట్టిసీమ నుండి బయలుదేరిన ఈ గోదావరి జలాలు.. 188 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శనివారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నాయి. ఆదివారం ఉదయానికి పవిత్ర సంగమానికి 3,750 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రానికి అది 4,800 క్యూసెక్కులకు పెరిగింది.

గోదావరి జలాలు తోడవ్వడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి లభ్యత పెరిగింది. దీంతో అధికారులు కృష్ణా వెస్ట్రన్ కెనాల్ మినహా, మిగిలిన డెల్టా కాలువల వ్యవస్థకు నీటి విడుదలను 5,322 క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేసి ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న నీరంతా పట్టిసీమ నుండి వస్తున్నదే. కృష్ణా డెల్టాలోని దాదాపు అన్ని ప్రధాన కాలువలకు గరిష్ట స్థాయిలో నీటిని సరఫరా చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks