నేటి రాశిఫలాలు: ఆదివారం ఈ రాశుల వారికి సూర్యుడిలాంటి ప్రకాశం.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!
Today Horoscope: మే 17, ఆదివారం నాడు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? సూర్యారాధనతో ఎవరి కష్టాలు తీరుతాయి? మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల పూర్తి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజును సాక్షాత్తు ఆ జగచ్చక్షువు, ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడికి అంకితం చేస్తాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారం నాడు సూర్యుడిని భక్తితో ఆరాధిస్తే ధనధాన్యాలకు లోటు ఉండదని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. గ్రహగతులు, నక్షత్రాల సంచారం ఆధారంగా మే 17, 2026 ఆదివారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి:
మేష రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు నెమ్మదిగా కొలిక్కి వస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఖర్చులు తడిసి మోపెడయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఆఫీసులో పై అధికారుల సహకారం మీకు కొండంత అండగా నిలుస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, పనుల తాకిడి వల్ల సాయంత్రానికి కాస్త అలసటగా అనిపించవచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి.
కర్కాటక రాశి:
పనిలో మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలగవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకే వాదనలకు దిగకుండా ఓపికగా ఉండండి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది.
కన్య రాశి:
కన్య రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది.
తులా రాశి:
నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు ఓపిక పట్టాల్సిన సమయం ఇది. పనులు పూర్తి కావడంలో జాప్యం జరగవచ్చు. ఆఫీసులో పనిభారం పెరగడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి అదృష్టం తోడవుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంట్లో శుభకార్యాల పట్ల చర్చలు జరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉంటారు.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పనుల్లో బిజీగా గడుపుతారు. ఉద్యోగంలో కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి కాలం కలిసి వస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
మీన రాశి:
మీన రాశి వారు కాస్త నిదానంగా వ్యవహరించాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు అధైర్య పడకండి. తోటి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆఫీసులో అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఆదివారం నాడు ఏ రాశి వారైనా సూర్యాష్టకం పఠించడం లేదా సూర్యుడికి నమస్కరించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోయి సానుకూల ఫలితాలు వస్తాయి. మీ సంకల్ప బలం, భగవంతుడి ఆశీస్సులు తోడైతే ఈ రోజు మీకు విజయవంతంగా ముగుస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


