ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం సాకారమైంది. గోదావరి జలాలు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర నేలను స్పృశించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని క్రాస్ రెగ్యులేటర్ మీట నొక్కి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు.

అనకాపల్లి జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాలువ నిర్మాణం, నీటి ప్రవాహ తీరును పరిశీలించారు. అనంతరం పాయకరావుపేట చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక కళాకారులు సంప్రదాయ కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
గోదావరి జలాల రాకకు సూచికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ప్రవాహ ప్రాంతానికి చేరుకున్న ఆయన, కాలువ వద్ద గోదావరి మాతకు పవిత్ర జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనితలతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి తాగు, సాగునీటి ఎద్దడి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తి చేసింది. ఎడమ కాలువ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,192 కోట్లను ఖర్చు చేసింది. ఈ కాలువ ద్వారా నాలుగు జిల్లాల పరిధిలోని దాదాపు 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సుమారు 9 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేలా ప్రణాళిక రూపొందించారు.
అనకాపల్లి వద్ద ఉన్న ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను ఈ జలాలతో సమర్థవంతంగా నింపనున్నారు. గోదావరి వరద జలాల వినియోగంతో ఉత్తరాంధ్రలోని అనేక ఆయకట్టు ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత లభించనుంది. పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80,000 ఎకరాలు, పంపా ప్రాజెక్టు పరిధిలో 12,000 ఎకరాలు, తాండవ, వరహా, మామిడిగడ్డ వీటన్నింటి పరిధిలోని 46,620 ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తుంది.
{{/usCountry}}అనకాపల్లి వద్ద ఉన్న ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను ఈ జలాలతో సమర్థవంతంగా నింపనున్నారు. గోదావరి వరద జలాల వినియోగంతో ఉత్తరాంధ్రలోని అనేక ఆయకట్టు ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత లభించనుంది. పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80,000 ఎకరాలు, పంపా ప్రాజెక్టు పరిధిలో 12,000 ఎకరాలు, తాండవ, వరహా, మామిడిగడ్డ వీటన్నింటి పరిధిలోని 46,620 ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తుంది.
{{/usCountry}}వీటితో పాటు మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించడం ద్వారా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని ప్రముఖ పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాతో పాటు తాగునీటి కొరతను అధిగమించేందుకు జలవనరుల శాఖ సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కొత్త ఉత్తేజాన్ని పుంజుకోనున్నాయి.