ఏపీ ప్రయాణికులకు శుభవార్త... సోలాపూర్-అనకాపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్! టైమింగ్స్, హాల్టింగ్ వివరాలు ఇలా
Solapur Anakapalle Weekly Express : సోలాపూర్ - అనకాపల్లి మధ్య వారపు ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా ఉన్న ఈ సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ రైలు నంబర్లు 11313/11314ను కేటాయించారు.
Solapur Anakapalle Weekly Express : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ప్రయాణించే వారికి మరింత సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తూ కొత్త వారపు ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సోలాపూర్ - అనకాపల్లి - సొలాపూర్ (రైలు నంబర్లు 11313/11314) పేరుతో ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తోంది.

ఇప్పటివరకు ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక రైలు (రైలు నంబరు 01477/01478) రూపంలో నడుస్తున్న ఈ సర్వీసులను రైల్వే శాఖ ఇప్పుడు క్రమబద్ధీకరించింది (రైలు నంబర్లు 11313/11314). రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది.
టైమింగ్స్ షెడ్యూల్….
- సోలాపూర్ - అనకాపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ - 11313) : ఈ రైలు ప్రతి శుక్రవారం ఉదయం 09:20 గంటలకు సోలాపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ రెగ్యులర్ సర్వీస్ ప్రయాణం 2026, ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుంది. మార్గమధ్యలో వివిధ కీలక స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం 14:40 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది.
- అనకాపల్లి - సోలాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 11314) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శనివారం రాత్రి 23:50 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈ సర్వీస్ 2026, ఆగస్టు 22 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆదివారం రాత్రి 23:50 గంటలకు ఈ రైలు సోలాపూర్ చేరుకుంటుంది.
హాల్టింగ్ వివరాలు…
ఈ రైలు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో అకల్‌కోట్ రోడ్, దుధ్ని, గాణాగాపూర్ రోడ్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదపల్లె రోడ్, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం. యలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఈ కొత్త రైలు సర్వీసుతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని సొలాపూర్, కర్ణాటకలోని ఆధ్యాత్మిక, పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా రవాణా సౌకర్యం లభించనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

