Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - రాజమండ్రి, గుంటూరు మీదుగా చర్లపల్లికి వన్ వే స్పెషల్ ట్రైన్, వివరాలు

South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సంబల్‌పూర్ నుంచి చార్లపల్లికి వన్‌వే స్పెషల్ రైలును ప్రకటించింది. ఆగస్టు 14న ఈ రైలు అందుబాటులో ఉంటుంది. 

Published on: Aug 12, 2026, 10:41:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sambalpur to Charlapalli Special Train : పండగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగిన ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి టెర్మినల్ వరకు ప్రత్యేక వన్‌వే స్పెషల్ రైలును నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది.

వన్ వే స్పెషల్ ట్రైన్
వన్ వే స్పెషల్ ట్రైన్

ట్రైన్ టైమింగ్స్….

రైలు నంబరు 08309 (సంబల్‌పూర్ – చర్లపల్లి) వన్‌వే స్పెషల్ రైలు ఆగస్టు 14వ తేదీ శుక్రవారం నాడు సంబల్‌పూర్ స్టేషన్ నుంచి ఉదయం 11:45 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శనివారం) ఉదయం 11:30 గంటలకు చార్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ ప్రత్యేక రైలుకు కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది.

  • ఒడిశా, ఉత్తరాంధ్ర మార్గం : బర్గఢ్ రోడ్, బలంగీర్, తిట్లగఢ్, కేసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ.
  • కోస్తాంధ్ర, తెలంగాణ మార్గం : సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ మరియు నల్గొండ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

కోచ్‌ల వివరాలు

ఈ వన్‌వే ప్రత్యేక రైలులో ప్రయాణికుల వసతి కోసం స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీ సమయంలో సొంత ఊళ్లకు వెళ్లి హైదరాబాద్ తిరిగొచ్చే ఉద్యోగులు, విద్యార్థులు మరియు ఇతర ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More