రెగ్యులర్ సర్వీస్‌గా తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్.. తెలంగాణలోనూ స్టాప్‌లు
తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే రెగ్యులర్ సర్వీస్‌గా నడుపుతోంది. సోమవారం(జూన్ 1) నుంచి ఈ ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 'తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్' రైలు సేవలను సోమవారం నుండి రెగ్యులర్ సర్వీసుగా ప్రారంభించింది. దీని ద్వారా బీహార్‌లోని రక్సౌల్ జంక్షన్‌కు తిరుపతి నుండి ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ లభిస్తుంది. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ రైలును.. ఇప్పుడు 17433, 17434 నంబర్లతో సాధారణ ఎక్స్‌ప్రెస్ రైలుగా ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలు రేణిగుంట, కడప, గుంతకల్లు, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ మార్గాల గుండా ప్రయాణించి రక్సౌల్ చేరుకుంటుంది. సుమారు 2,795 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ రైలు సేవ, తిరుపతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని ప్రధాన గమ్యస్థానాలతో కనెక్ట్ చేస్తుంది.
జల్నా - తిరుపతి
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జల్నా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 2026 జూన్ మొదటి వారం నుంచి జూన్ ఆఖరి వారం వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
రైలు నంబర్ 07814 (జల్నా - తిరుపతి) : ఈ ప్రత్యేక రైలు జూన్ 4, 2026 నుంచి జూన్ 25, 2026 వరకు ప్రతి వారం గురువారం నాడు జల్నా స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది.
రైలు నంబర్ 07815 (తిరుపతి - జల్నా): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ 5, 2026 నుంచి జూన్ 26, 2026 వరకు ప్రతి వారం శుక్రవారం నాడు తిరుపతి నుండి జల్నాకు ప్రయాణికులను చేరవేస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
ఆంధ్రప్రదేశ్: విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
తెలంగాణ: బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


