బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా రూట్ మార్చి, కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) అధికారులు రట్టు చేశారు. విజయవాడ శివార్లలో వ్యూహాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో దాదాపు రూ. 5.84 కోట్ల విలువైన విదేశీ బంగారం, అమెరికన్ డాలర్లు, యూరోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.
పక్కా సమాచారంతో….

బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా విదేశీ బంగారాన్ని మన దేశంలోకి అక్రమంగా తెచ్చి, కోల్‌కతా ద్వారా హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయవాడ సమీపంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉమ్మడి ఆపరేషన్ చేపట్టారు.
విజయవాడ శివార్లలో వెళ్తున్న ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV)ను డిఆర్‌ఐ అధికారులు ముందుగా అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో రహస్యంగా ఏర్పాటు చేసిన డ్రాయర్ (సీక్రెట్ క్యావిటీ)లో భారీగా విదేశీ కరెన్సీ లభ్యమైంది. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా…. వారు విజయవాడ సమీపంలోనే కొంత బంగారాన్ని డెలివరీ చేశారని, లభ్యమైన కరెన్సీ ఆ స్మగ్లింగ్ సొమ్ముకు సంబంధించినదేనని ఒప్పుకున్నారు.
వారిచ్చిన సమాచారంతో మరో బృందం హైదరాబాద్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును టోల్ ప్లాజా వద్ద అడ్డుకుంది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితులను తనిఖీ చేయగా…. వారి నడుముకు ప్రత్యేకంగా కట్టుకున్న పౌచ్‌లలో విదేశీ మార్క్ ఉన్న మూడు బంగారు బిస్కట్లు బయటపడ్డాయి.
రూ. 5.84 కోట్ల ముఠా గుట్టు రట్టు
ఈ ఆపరేషన్‌లో మొత్తం 3,147.1 గ్రాముల (3.1 కేజీలు) విదేశీ బంగారం, 60,000 అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను అధికారులు జప్తు చేశారు. వీటి మొత్తం విలువ మార్కెట్లో రూ. 5.84 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
{{/usCountry}}ఈ ఆపరేషన్‌లో మొత్తం 3,147.1 గ్రాముల (3.1 కేజీలు) విదేశీ బంగారం, 60,000 అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను అధికారులు జప్తు చేశారు. వీటి మొత్తం విలువ మార్కెట్లో రూ. 5.84 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
{{/usCountry}}ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులపై కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులపై డీఆర్‌ఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు.